ఈశాన్య రాష్ట్రాలను వణికించిన రిమల్ తుపాను...

రిమల్ తుపానుతో ఈశాన్య రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. ఒక్క అసోంలోని 9 జిల్లాల్లో కురుసిన భారీ వర్షాలకు రోడ్లు,భవనాలు భారీగా దెబ్బతిన్నాయి. దాదాపు 2 లక్షల మంది ప్రజలు నిరశ్రాయులైయారు.

New Update
ఈశాన్య రాష్ట్రాలను వణికించిన రిమల్ తుపాను...

రిమల్ తుపానుతో ఈశాన్య రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. ఒక్క అసోంలోనే 9 జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు దాదాపు 2 లక్షల మంది ప్రజలు తీవ్రంగా నష్టపోయారు.రిమాల్ తుపాను ఈశాన్య రాష్ట్రాల్లో జనజీవనాన్ని తలకిందులు చేసింది. వేసవి కాలంలో అసాధారణంగా కురిసిన భారీ వర్షాల కారణంగా, తిమా హసో, నఖోన్, కరీంగంజ్, హోజాయ్ మరియు కోలగట్‌లతో సహా అస్సాంలోని దక్షిణ భాగం భారీ నష్టాన్ని చవిచూసింది.

3 వేలహెక్టార్ల వ్యవసాయ భూములు వర్షపు నీటికి దెబ్బతిన్నాయి. 110 భద్రతా శిబిరాల్లో 35 వేలకు పైగా తలుదాచుకున్నారు. దిమా హసో జిల్లాలో రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వరదల్లో చిక్కుకున్న వారిని స్థానికులు తాడు సహాయంతో రక్షించారు.మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో 35 ఏళ్లలో ఎన్నడూ లేనంత భారీ వర్షపాతం నమోదైంది. ఇంఫాల్‌లోని క్వారాంబండ్ మార్కెట్ ప్రాంతం వరదతో మునిగిపోవటంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు

అస్సాం రైఫిల్స్ బృందం ఇంఫాల్‌లోని నిరాశ్రయుల గృహంలో చిక్కుకున్న 42 మందిని పడవలలో సురక్షితంగా రక్షించింది. ప్రధాన వీధులన్నీ నదుల్లా ప్రవహిస్తుండగా కుండీల్లో పెట్టి చిన్నారులను కాపాడుతున్న దృశ్యం చూపరులను అయోమయానికి గురి చేసింది.అస్సాం మేఘాలయ జాతీయ రహదారిపై భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. త్రిపుర, మిజోరం, ఉత్తర మణిపూర్‌లను కలిపే ప్రధాన రహదారి వరదలు మరియు కొండచరియలు విరిగిపడటంతో తెగిపోయింది.ఇళ్లలోపల నాలుగు అడుగుల మేర నీరు ఉండడంతో కరెంటు, తాగునీరు లేకుండా ప్రజలు అవస్థలు పడుతున్నారు.

Advertisment
తాజా కథనాలు