/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/RGV-vs-Pawan-jpg.webp)
RGV Comments on Pawan : రాం గోపాల్ వర్మ(Ram Gopal Varma).. సినీ ఇండ్రస్ట్రీలోనే కాదు.. తెలుగు రాజకీయాల్లోనూ ఆయన సంచలనంగా మారుతున్నారు. ఆయన మాటలు బాంబుల కంటె ఎక్కువ తీవ్రతతో పేలుతున్నాయి. ఇప్పటికే పొలికల్‌గా ఎంత రచ్చ చేయాలో అంతకు మించి రచ్చ చేసిన రాంగోపాల్ వర్మ.. తాజాగా పవన్ కల్యాణ్(Pawan Kalyan), చంద్రబాబును ఉద్దేశించి సంచలన కామెంట్స్ చేశారు. ఎక్స్ వేదికగా.. నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని కుండబద్దలుకొట్టారు.
తెలంగాణలో ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడు తెలుగు ప్రజలందరి దృష్టి మళ్లీ ఏపీ రాజకీయాలపై పడింది. వైసీపీ అధినేత, సీఎం జగన్, విపక్ష నేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ మాటల తూటాలతో రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలో ఇంటర్‌ఫియర్ అయిన రాంగోపాల్ వర్మ.. తానేం తక్కువ అంటూ సోషల్ మీడియా వేదికగా పొలిటికల్ బాంబ్ పేల్చారు. పవన్, చంద్రబాబు టార్గెట్‌గా సరికొత్త సందేహం వ్యక్తం చేస్తూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. జనసేన పార్టీలో పవన్ కల్యాణే చంద్రబాబు కోవర్టేమోనని సందేహం వ్యక్తం చేశారు. 'నాకో సందేహం వస్తోంది. జనసేన పార్టీలో పవన్ కల్యాణే చంద్రబాబుకు కోవర్ట్‌గా పని చేస్తున్నారేమో?' అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు రాంగోపాల్ వర్మ.
I think PAWAN KALYAN is CBN’S covert in JANASENA
— Ram Gopal Varma (@RGVzoomin) December 14, 2023
వర్మ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. పవన్, టీడీపీ(TDP Fans) అభిమానులు వర్మపై దుమ్మెత్తిపోస్తుండగా.. మరికొందరు ఆయన కామెంట్స్‌ని సమర్థిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి మరోసారి ఏపీ రాజకీయాల్లో వెలు పెట్టి రచ్చ చేస్తున్నారు వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ.
CHEERS to the ANIMAL behind ME 🍺 pic.twitter.com/hGEq2sfo5j
— Ram Gopal Varma (@RGVzoomin) December 14, 2023
ఇదిలాఉంటే.. ఏపీ రాజకీయాల నేపథ్యంలో.. ఆర్జీవీ వ్యూహం సినిమాను తీస్తున్న విషయం తెలిసిందే. ఈసినిమాను రెండు పార్ట్‌లుగా నిర్మించిన వర్మ.. వ్యూహం పార్ట్ 1 ను ఈ నెల అంట డిసెంబర్ 29వ తేదీన విడుదల చేయనున్నారు. పార్ట్ 2 సినిమాను జనవర్ 24న విడుదల చేయనున్నట్లు రాంగోపాల్ వర్మ ప్రకటించారు.
— Ram Gopal Varma (@RGVzoomin) December 14, 2023
Also Read:
ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్ ఎప్పుడు? కీలక అప్‌డేట్స్ మీకోసం..
సీఎం పర్యటనలో అపశృతి.. హెలీప్యాడ్ వద్ద కుప్పకూలిన ధర్మాన కృష్ణదాస్ తనయుడు..