లోకేశ్ వ్యాఖ్యలపై ఆర్జీవీ కౌంటర్..చూడు బేబీ అంటూ వర్మ రియాక్షన్..!

ఆంధ్ర రాష్ట్రానికి అతనేం చేశాడు అంటూ లోకేశ్ చేసిన వ్యాఖ్యలకు డైరెక్టర్ ఆర్జీవీ తనదైన శైలిలో కౌంటర్ వేశారు. 'చూడు బేబీ..విమర్శించాలి అనుకుంటే ఆంధ్ర రాష్ట్రం తప్ప మరో టాపిక్ దొరకలేదా? నీ స్థానంలో నేనుంటే ఏం చెప్పేవాడ్నో తెలుసా? వాడొక పిచ్చోడు, పిచ్చి పిచ్చి సినిమాలు తీస్తుంటాడు, అడ్డదిడ్డమైన ట్వీట్లు పెడుతుంటాడు, పొద్దునే లేచి పోర్న్ చూస్తాడు.. అలాంటి వాడు ఏదో అంటే అందుకు నేను స్పందించాలి?' అనేవాడ్ని అంటూ వ్యంగ్యంగా ట్వీట్‌ చేశాడు.

RGV: రేపే వ్యూహం ప్రీరిలీజ్‌ ఈవెంట్‌..పవన్‌, చంద్రబాబు, లోకేష్‌కు ఆర్జీవీ ఆహ్వానం.!
New Update

RGV Counter to Nara Lokesh: రాజమండ్రి జైలులో చంద్రబాబును (Chandrababu) కలిశాక నారా లోకేశ్ (Nara Lokesh) మీడియాతో మాట్లాడిన సంగతి తెలిసిందే. ఇందులో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) జైలు ఎదుట సెల్ఫీ తీసుకుని చేసిన వ్యాఖ్యల మీద మీడియా లోకేశ్ స్పందన కోరింది. దానికి చంద్రబాబు రాష్ట్రానికి ఎంతో చేశారు.. వర్మ ఏం చేశాడు .. అతడేదో అంటే నేను మాట్లాడాలా అంటూ లోకేశ్ బదులిచ్చారు. ఈ కామెంట్స్ మీద వర్మ మళ్ళీ స్పందించారు. లోకేశ్ వ్యాఖ్యలపై  తనదైన శైలిలో కౌంటర్ ఇస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Also Read: అది తట్టుకోలేకే క్రిష్టియన్ సంస్థపై బాంబు దాడి.. నిందితుడి వీడియో వైరల్ .!

లోకేశ్ ను చూసి జాలిపడాలో, నవ్వాలో, లేక ఏంచేయాలో అర్థం కావడంలేదని అన్నారు వర్మ. "ఆంధ్ర రాష్ట్రానికి నేనెందుకు చేస్తాను.. నేను ఒక ఫిలింమేకర్ ని. నేను సినిమాలు తీస్తుంటాను. నేను నీలాగా ప్రజలకు సేవ చేయడానికి పుట్టాను, పెరుగుతున్నాను, చస్తాను అని ఎప్పుడైనా చెప్పానా. చూడు బేబీ.. నన్ను విమర్శించాలని నువ్వు అనుకున్నావు. మరి నన్ను విమర్శించేందుకు ఆంధ్ర రాష్ట్రం తప్ప మరో టాపిక్ దొరకలేదా. నీ స్థానంలో నేనుంటే ఏం చెప్పేవాడ్నో తెలుసా.. వాడొక పిచ్చోడు, పిచ్చి పిచ్చి సినిమాలు తీస్తుంటాడు, అడ్డదిడ్డమైన ట్వీట్లు పెడుతుంటాడు, పొద్దునే లేచి పోర్న్ చూస్తాడు... అలాంటి వాడు ఏదో అంటే అందుకు నేను స్పందించాలా? అనేవాడ్ని. ఆ మాత్రం కూడా తెలివి లేకపోతే ఎలా బేబీ! అంటూ కౌంటర్ ఇచ్చారు.

నా జీవితం తెరిచిన పుస్తకం వంటిది. నీలాగా స్విమ్మింగ్ ఫూల్ లో అమ్మాయిలతో కలిసున్న ఫొటోలు దాచిపెట్టడం వంటివేవీ నా దగ్గర ఉండవమ్మా. చంద్రబాబు ఉన్న పరిస్థితి చూసి నీ మైండ్ ఏమైనా స్థిరత్వం కోల్పోయిందేమో... ఎవరికైనా చూపించుకో. నాలాంటి వాడ్ని విమర్శించడానికే నువ్వు సరైన టాపిక్ ఎంచుకోలేకపోతే, మీ నాన్నను ఇక దేవుడు కూడా కాపాడలేడు" అంటూ వర్మ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియోను వర్మ (Ram Gopal Varma) సోషల్ మీడియాలో పంచుకున్నారు.

Also Read: అయ్యో ..మంచు విష్ణుకు ఏమైంది..ఆందోళనలో ఫ్యాన్స్‌..!!

#nara-lokesh #rgv
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe