Exams : ఎన్నికల కోడ్ ఎఫెక్ట్... వాయిదా పడిన ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఇవే..!

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు పరీక్షల షెడ్యూల్ పై ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ పడింది. JEE మెయిన్, MHT-CET, EAPCET, NEET PG, వంటి పరీక్షలు వాయిదా పడ్డాయి. పూర్తి వివరాలు ఈ లింక్ క్లిక్ చేసి చదవండి.

AP: నాలుగు రోజుల్లో పది సప్లిమెంటరీ పరీక్షలు..షెడ్యూల్‌ ఇదే!
New Update

Election Code :  దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల కోడ్(General Election Code) అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు 7 విడతల్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ కూడా రిలీజ్ అయ్యింది. దీంతో దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్(Election Code) అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో పలు పరీక్షల షెడ్యూల్ పై ఈ ఎన్నికల ప్రభావం పడింది. జేఈఈ మెయిన్స్(JEE Mains), యూపీఎస్సీ ప్రిలిమ్స్, నీట్ పీజీ, ఎమ్ హెచ్ టీ సెట్, కే సెట్, టీఎస్ ఈఏపీసెట్, పాలీసెట్, వంటి పరీక్షలపై ఎన్నికల ప్రభావం పడనుంది.

ఎన్నికల ప్రబావంతో ఈ క్రింద పేర్కొన్న పరీక్షా తేదీల్లో మార్పులు ఉండనున్నాయి.

జేఈఈ మెయిన్ (JEE MAIN):
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) JEE మెయిన్ 2024 సెషన్ 2ని మునుపటి తేదీలైన ఏప్రిల్ 4 నుండి 15కి బదులుగా ఏప్రిల్ 4 నుండి 12, 2024 వరకు తిరిగి షెడ్యూల్ చేసింది.

MHT-CET (PCM, PCB) పరీక్షలు:
వాస్తవానికి ఏప్రిల్ 16, 30 మధ్య షెడ్యూల్ చేసిన MHT-CET (PCM గ్రూప్) పరీక్షలు ఇప్పుడు మే 2 నుండి 17 వరకు జరుగుతాయి. PCB గ్రూప్ పరీక్షలు ఏప్రిల్ 22, 30 మధ్య జరుగుతాయి.

TS EAPCET 2024:
TS EAPCET 2024 పరీక్ష మే 9, 10, 11, 12, 2024 తేదీలలో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు, మధ్యాహ్నం 3:00 నుండి సాయంత్రం 6:00 వరకు రెండు షిఫ్టులలో నిర్వహిస్తారు.

TS పాలీసెట్:
మొదట్లో మే 17, 2024న నిర్ణయించారు. ఇప్పుడు TS పాలిసెట్ మే 24, 2024న ఉదయం 11:00 నుండి మధ్యాహ్నం 1:30 వరకు నిర్వహించనున్నారు.

AP EAPCET 2024:
ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP EAPCET) 2024 మే 16, 22, 2024 మధ్య జరుగుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్(APSCHE) సవరించింది.

UPSC సివిల్ సర్వీస్ పరీక్ష:
గతంలో మే 26, 2024న షెడ్యూల్ చేసిన UPSC సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ పరీక్ష జూన్ 16, 2024కి రీషెడ్యూల్ చేశారు.

NEET PG 2024:
NEET PG 2024 పరీక్ష జూన్ 23, 2024కి వాయిదా పడింది. జూలై 15, 2024లో ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.

ICAI CA పరీక్ష:
ICAI CA ఇంటర్మీడియట్ పరీక్షలు ఇప్పుడు మే 3, 5, 9, 2024, గ్రూప్ 1 కోసం మే 11, 15, 17, 2024 న గ్రూప్ 2 కోసం నిర్వహిస్తారు.

CUET UG పరీక్షలపై అనిశ్చితి:
CUET UG పరీక్షలు మే 15,31, 2024 మధ్య షెడ్యూల్ చేసినప్పటికీ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)ఎన్నికల షెడ్యూల్ కారణంగా తేదీలను సవరించడాన్ని పరిశీలిస్తోంది.

జేఈఈ అడ్వాన్స్‌డ్, నీట్ యూజీకి ఎలాంటి మార్పులు లేవు:
JEE అడ్వాన్స్‌డ్ 2024 పరీక్ష ఎలాంటి మార్పులు లేకుండా మే 26, 2024న షెడ్యూల్ ప్రకారం కొనసాగుతుంది. అదేవిధంగా, NEET UG 2024 మే 5, 2024కి సెట్ చేశారు. అయినప్పటికీ ఇంకా ఎలాంటి సవరణలు ప్రకటించలేదు.

KCET 2024 పరీక్ష తేదీలు ప్రభావితం కాలేదు:
నేషనల్ డిఫెన్స్ అకాడెమీ(NDA) పరీక్షలతో ఘర్షణలను నివారించడానికి మునుపటి సవరణలు ఉన్నప్పటికీ, కర్ణాటక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (KCET) 2024 ఏప్రిల్ 18, 19, 2024 తేదీల్లో నిర్వహించనున్నారు.

ఇది కూడా చదవండి : బీఆర్ఎస్ నేతలకు ఫస్ట్రేషన్.. అందుకే కాంగ్రెస్ లోకి.. కడియం సంచలన ఇంటర్వ్యూ..!

#telangana #election-code-effect #ts-eapcet #ts-polycet #jee-main
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe