TS Jobs : 9800 పోస్టులతో రేవంత్ సర్కార్ మెగా డీఎస్సీ.. నోటిఫికేషన్ ఎప్పుడంటే?

రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కొత్త ప్రభుత్వం ఉద్యోగ నియామకాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ క్రమంలోనే మెగా డీఎస్సీ వేసేందుకు చర్యలు చేపట్టింది. ఈక్రమంలోనే డీఎస్సీపై త్వరలోనూ స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

TS Jobs : 9800 పోస్టులతో రేవంత్ సర్కార్ మెగా డీఎస్సీ.. నోటిఫికేషన్ ఎప్పుడంటే?
New Update

DSC Notification : తెలంగాణ(Telangana) రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ(Congress Party) అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) నిరుద్యోగ సమస్యలపై ఫోకస్ పెట్టారు. కాంగ్రెస్ పార్టీని అధికారికంలోకి తీసుకువచ్చేందుకు సక్సెస్ అయిన రేవంత్ రెడ్డి...ఇప్పుడు ప్రజా సమస్యలు, నిరుద్యోగ సమస్యలపై ద్రుష్టి సారించారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం ఉద్యోగ నియామకాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటి. గతంలో వాయిదా పడిన పరీక్షలు, కొత్త నియామకాలపై కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే డీఎస్సీపై కూడా త్వరలోనే స్పష్టమైన ప్రకటన చేయనున్నట్లు సమాచారం.

తెలంగాణ రాష్ట్రంలో టీచర్ పోస్టుల కోసం లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. అయితే వారందరికీ గుడ్ న్యూస్ చెప్పనుందట కాంగ్రెస్ సర్కార్. అతి త్వరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ తేదీని ప్రస్తావించారు. దీంతో ఈ నోటిఫికేషన్ కోసం డీఎస్సీ అభ్యర్థులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.

రాష్ట్రంలో డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం ఆధ్వర్యంలో మెగాడీఎస్సీ సాధన పేరుతో హైదరాబాద్ దిల్ షుక్ నగర్ లో డిసెంబర్ 13వ తేదీన ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రొ. కోదండరాం పాల్గొని పలు కీలక విషయాలను ప్రస్తావించారు. గత సర్కార్ 10ఏళ్ల కాలంలో విద్యారంగాన్ని భ్రష్టు పట్టించిందని..దాన్ని బలోపేతం చేసేందుకు అందరూ పాటుపడాలని తెలిపారు. అలాగే గతంలో మూసివేసిన ఆరు వేల ప్రభుత్వ పాఠశాలలను తెరిపిస్తే..కనీసం 6వేల ఉపాధ్యాయ పోస్టులు వస్తాయని..అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలలకు ఫీజులు చెల్లించే భారం కూడా తగ్గుతుందని కోదండరాం తెలిపారు. ఈ క్రమంలోనే మెగా డీఎస్సీ ప్రతిపాదనలు కొనసాగుతున్నాయని చెప్పారు.

కాగా ప్రస్తుతం తెలంగాణలో మొత్తం 20,740 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు అంటున్నారు. 2023లో 5,089 పోస్టుల భర్తీకి డీఎస్సీ నిర్వహణకు సిద్ధం అయ్యింది గత ప్రభుత్వం. ఈ మేరకు అప్లికేషన్స్ కూడా తీసుకున్నారు. ఎన్నికలు రావడంతో ఆ డీఎస్సీ పరీక్ష కూడా వాయిదా పడింది. అయితే కొత్త సర్కార్ మాత్రం ప్రస్తుతం విద్యాశాఖ ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలున్నాయనే అంశాన్ని పరిశీలిస్తుందట. ఉన్నత స్థాయి సమీక్ష తర్వాతే రాష్ట్రంలో డీఎస్సీ పోస్టుల విషయంలో ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సారి మాత్రం మెగా డీఎస్సీ నిర్వహించి వేల సంఖ్యలో టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయాలన్న పక్కా ప్లాన్ తో కాంగ్రెస్ సర్కార్ ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

అయితే గతంలో తీసుకున్న దరఖాస్తులతోనే నియామక పరీక్షలు నిర్వహిస్తారా? లేదంటే కొత్తగా మళ్లీ దరఖాస్తులు తీసుకుంటారా ? అనే గందరగోళం అభ్యర్థుల్లో నెలకొంది. అయితే దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

ఇది కూడా చదవండి: ప్రభుత్వ ఉద్యోగమే మీ టార్గెటా? డీఏఈ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్…ఇలా అప్లయ్ చేసుకోండి..!!

#cm-revanth-reddy #mega-dsc #dsc-job-notification #ts-jobs
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe