LPG Gas : గ్యాస్ సిలిండర్ ధరపై రేవంత్ సర్కార్ కీలక అప్ డేట్...సిద్ధంగా ఉండండి..!!

గ్యాస్ సిలిండర్ ధరపై రేవంత్ సర్కార్ కీలక అప్ డేట్ అందించేందుకు రెడీ అయ్యింది. 2 వారాల్లో ఈ స్కీంను అమలు చేసేందుకు ప్లాన్ చేస్తోంది. కొద్ది రోజులు ఓపికపడితే రూ. 500లకే గ్యాస్ సిలిండర్ ను పొందగలం.

LPG Gas : సామాన్యుడికి మోదీ సర్కార్ గుడ్ న్యూస్...గ్యాస్ ధరలపై కీలక నిర్ణయం..!!
New Update

Revanth Update : తెలంగాణ సర్కార్ రూ. 500కే గ్యాస్ సిలిండర్(Gas Cylinder) ఇచ్చే ఛాన్సే లేదని..ఖజానాలో అంత డబ్బు లేదని ప్రతిపక్షం అంటోంది. కానీ సర్కార్ మాత్రం దీన్ని ఇంచేందుకు సిద్ధమవుతోంది. కొన్నిరోజులు ఓపిక పడితే రూ. 500కే గ్యాస్ సిలిండర్ పొందే ఛాన్స్ ఉంటుంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం రూ. 500కే గ్యాస్ సిలిండర్ వచ్చే హామీపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే ఈ హామీ కర్నాటకలో అమలు అవుతోంది. మొన్నటిదాకా రాజస్థాన్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్(Congress) ప్రభుత్వం కూడా అమలు చేసింది. ఇప్పుడు తెలంగాణలోనూ కాంగ్రెస్ దీనికి కోసం రెడీ అయ్యింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంకో రెండు వారాల్లో ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలిసింది.

అయితే తెలంగాణలో నెలకు ఒక సిలిండర్ మాత్రమే వాడుతున్న వారి సంఖ్య 53 లక్షలు ఉంది. వారందరికీ రూ. 500 చొప్పున సిలిండర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ లెక్కన ఏడాదికి ఎన్ని సిలిండర్లను రూ. 500చొప్పున ఇవ్వాలనే దానిపై సర్కార్ లెక్క తేల్చింది. దాని ప్రకారం ఖజానాపై రూ. 4,450కోట్ల భారం పడుతున్నట్లు అంచనా వేసింది. మరి ఆ డబ్బును ఎలా సేకరించాలి. ఎక్కడి నుంచి సేకరించాలి. నెల నెలా ఎలా కేటాయించాలి అనే దానిపై ప్రభుత్వం ముందున్న సవాలు. ఇప్పుడు దానిపైన్నే లోతుగా చర్చలు జరుగుతున్నాయి.

నిజానికి సర్కార్ 6 గ్యారెంటీల హామీలతోపాటు మరెన్నో హామీలు ఇచ్చిందన్న సంగతి మనకు తెలుసు. మిగతా హామీల సంగతి పక్కన పెడితే..ఈ 6 గ్యారెంటీ హామీలను ముందుగా వంద రోజుల్లో అమలు చేసి చూపించాలని సీఎం రేవంత్ రెడ్డి టీమ్ పట్టుదలగా ఉంది. ముఖ్యంగా రూ. 500కే సిలిండర్ ఇవ్వాలనేది సోనియాగాంధీ కల. దీన్ని కర్నాటక, రాజస్థాన్ లో అమలు చేశారు. ఇప్పుడు తెలంగాణలో కూడా కచ్చితంగా అమలు చేసి చూపిస్తారని మనం అనుకోవచ్చు.

అర్హులు ఎవరు?
కానీ రూ. 500కే సిలిండర్ పొందేందుకు అర్హులు ఎవరు?నిబంధనలు ఎలా ఉన్నాయి? అనే దాని గురించి ప్రస్తుతం చర్చ సాగుతోంది. ఈ రూల్స్ రూపొందించాక అప్పుడు ఎంత మంది లబ్ధిదారుల సంఖ్య తేలుతుంది. వారికి రూ. 500కే సిలిండర్ ఇచ్చేందుకు నెలకు ఎంత ఖర్చు అవుతుందో ఆ లెక్కను ప్రాతిపాదికన తీసుకుని రేషన్ కార్డు ఉన్న వారినీ లేని వారిని కూడా అర్హులుగా ఎంపిక చెయ్యాలనే ఆలోచనలో సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక తెలంగాణలో మొత్తం 1.20కోట్ల గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి. వీరిలో 44శాతం మంది నెలకోసారి గ్యాస్ సిలిండర్ కోసం బుక్ చేస్తున్నారు. నెలవారీ 52.80లక్షల మంది గ్యాస్ సిలిండర్ వాడుతున్నట్లు అంచనా వేశారు. అయితే రేషన్ కార్డులు 89.99లక్షల మందికి ఉన్నాయి. తక్కవ ధరకు వస్తోందని అతిగా గ్యాస్ వాడరు కాబట్టి..నెలవారీ బుకింగ్స్ ఒకే విధంగా ఉంటాయని సర్కార్ భావిస్తోంది. ఇలా ఎన్నో లెక్కలు వేస్తూ..2 లేదా మూడు వారాల్లో గ్యాస్ సిలిండర్ ను రూ. 500కే ఇస్తారని తెలుస్తోంది. కొత్త ఏడాది నుంచి ఇస్తారని సమాచారం.

ఇది కూడా చదవండి: ప్రభుత్వ ఉద్యోగమే మీ టార్గెటా? డీఏఈ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్…ఇలా అప్లయ్ చేసుకోండి..!!

#lpg-gas-cylinder #lpg-gas-rate #revanth-sarkar #lpg-gas
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి