/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Revanth-Reddy-Chief-Ministe-jpg.webp)
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేపు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన అందరికీ ఆహ్వానం పలికారు. ఈ మేరకు లేఖ విడుదల చేశారు రేవంత్. లేఖలో ఆయన ఏమన్నారంటే..
ఇది కూడా చదవండి: Revanth Reddy Oath: రేవంత్ ప్రమాణస్వీకారానికి వాళ్ళొస్తారా? మొహం చాటేస్తారా?
''తెలంగాణ ప్రజలకు అభినందనలు. విద్యార్థుల పోరాటం, అమరుల త్యాగం, శ్రీమతి
సోనియాగాంధీ ఉక్కు సంకల్పంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మనందరి ఆకాంక్షలు
నెర్వేర్చే ఇందిరమ్మ రాజ్య స్థాపనకు సమయం ఆసన్నమైంది. రాష్ట్రంలో ప్రజాస్వామ్య, పారదర్శక పాలన అందించేందుకు.. బలహీన వర్గాలు, దళిత,
గిరిజన, మైనారిటీ, రైతు, మహిళ, యువత సంక్షేమ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు...
మీ అందరి ఆశీస్సులతో 2023 డిసంబర్ 7న, మధ్యాహ్నం 1.04 గంటలకు
హైదరాబాద్ ఎల్బీ సేడియంలో ప్రజా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయబోతోంది. ఈ
మహోత్సవానికి రావాల్సిందిగా మీ అందరికీ ఇదే ఆహ్వానం.
- మీ రేవంత్ రెడ్డి,
సీఎల్పీ నాయకుడు''