Revanth Reddy Oath: రేవంత్ ప్రమాణస్వీకారానికి వాళ్ళొస్తారా? మొహం చాటేస్తారా?

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినపుడు జరిగిన వేడుకకు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమిలో ఉన్న నేతలు హాజరు అయ్యారు. నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోవడంతో తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి ఇండియా కూటమి నేతల హాజరుపై అనుమానాలు మొదలయ్యాయి. 

Revanth Reddy Oath: రేవంత్ ప్రమాణస్వీకారానికి వాళ్ళొస్తారా? మొహం చాటేస్తారా?
New Update

Revanth Reddy Oath: కాంగ్రెస్ పార్టీ దక్షిణాదిన తన ఉనికి ఎప్పటికప్పుడు ఎదో విధంగా నిలబెట్టుకుంటూ వస్తోంది. మొన్న కర్ణాటకలో సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా అధికారం అందుకుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా తెలంగాణ లో అధికారంలోకి వచ్చింది. కర్ణాటక ఎన్నికలకు కాస్త ముందుగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నేతృత్వంలో కొత్త కూటమి ఏర్పాటు చేయాలని భావించారు. అంతకు ముందుగా ఉన్న యూపీఏ ని కాస్త విస్తృత పరిచి కొత్త కూటమి ఏర్పాటు చేయడం కోసం పార్టీల మధ్యలో చర్చలు జరిగాయి. ఇదిలా ఉండగా ఈలోపు కర్ణాటక ఎన్నికలు వచ్చాయి. అక్కడ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని ఆధిక్యంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సిద్ధరామయ్య  ముఖ్యమంత్రిగా మే 20వ తేదీన అట్టహాసంగా ప్రమాణస్వీకారం  చేశారు. 

సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ అగ్రనాయకులతో పాటు.. కాంగ్రెస్ కూటమిలో భాగస్వాములు కావాలనుకుంటున్న నేతలు అందరూ వచ్చారు. లిస్ట్ చూస్తే కనుక.. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా లతో పాటు.. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖాయమంత్రులు ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోట్ హాజరు అయ్యారు. ఇక మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాధ్ కూడా వచ్చారు. 

ఇక తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, బీహార్ ముఖ్యమంత్రి జేడీయూ అధినేత నితీష్ కుమార్, బీహార్ ఉప ముఖ్యమంత్రి ఆర్జేడీ నేత తేజశ్వీ యాదవ్, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫారూక్ అబ్దుల్లా, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ.వంటి వారు హాజరయ్యారు. ఆ తరువాత జూన్ లో ఈ నేతలందరూ కలిసి ఒక కూటమి ఏర్పాటు కోసం సూత్రప్రాయంగా ఒప్పందానికి వచ్చారు. మరో నెలకు రెండో సమావేశం వీరి మధ్య జరిగింది. అప్పుడు ఆ కూటమికి ఇండియా (INDIA) అంటే Indian National Developmental Inclusive Alliance అని పేరు పెట్టుకున్నారు. దీనిలో అప్పుడు 26 పార్టీలు సభ్యులుగా ఉన్నాయి. 

Also Read:  రేపే సీఎంగా రేవంత్‌ రెడ్డి ప్రమాణం.. కేసీఆర్‌కు స్పెషల్ ఇన్విటేషన్..!

ఇప్పుడు కాలచక్రం గిర్రున తిరిగింది. ఇండియా కూటమి అసలు ఉందొ లేదో తెలియని పరిస్థితికి వచ్చేసింది. ఇటీవలే తెలంగాణతో పాటు నాలుగు రాష్ట్రాలకు ఎన్నికలు జరిగాయి. అందులో తెలంగాణ తప్ప మిగిలిన అన్ని రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ చావు దెబ్బ తింది . విశేషం ఏమిటంటే, ఈ రాష్ట్రాల్లో రెండు చోట్ల కాంగ్రెస్ అధికారంలో ఉంది. బీజేపీ ఇప్పుడు ఆ  రాష్ట్రాలను తన ఖాతాలో వేసుకుంది. ఇదిలా ఉంటె తెలంగాణ రాష్ట్రంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని మట్టికరిపించి కాంగ్రెస్ జయ కేతనం ఎగురవేసింది. ఇప్పుడు రేపు అంటే డిసెంబర్ 7న తెలంగాణలో(Revanth Reddy Oath) కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరనుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. 

మొన్నటి ఎన్నికలతో జాతీయ స్థాయిలో పరిస్థితిలు మారిపోయాయి. కాంగ్రెస్ పరిస్థితి గందరగోళంగా మారింది. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి పరిస్థితి ఏమిటనే అనుమానాలు మొదలు అయ్యాయి. దీనికి కారణం.. ఈ కూటమిలో కీలకమైన నేతలు అందరూ కాంగ్రెస్ పార్టీపై పలురకాలుగా వ్యాఖ్యానాలు చేశారు. నిజానికి ఈనెల ఆరోతేదీన ఇండియా కూటమి సామావేశం ఉంటుందని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ప్రకటించారు. ఈ ప్రకటన కొద్దీ సేపటికే కీలక నాయకులు కాంగ్రెస్ పార్టీపై పలు వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి  మమతా బెనర్జీ అయితే, ఇండియా కూటమి మీటింగా? ఎక్కడా అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. 

ఈ నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం(Revanth Reddy Oath) కొలువు తీరే వేడుక కోసం ఇండియా కూటమి నాయకులు హాజరు అవుతారా? లేదా? అనేది పెద్ద ప్రశ్నగా మారింది. కర్ణాటక ఎన్నికల సమయానికి కాంగ్రెస్ కి జాతీయ స్థాయిలో ఉన్న పరిస్థితి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు సమయంలో లేదనేది సుస్పష్టం. అధికారంలో ఉన్న కీలకమైన రెండు రాష్ట్రాల్లో ఘోర పరాజయం ఆ పార్టీని జాతీయ స్థాయిలో నీరస పరిచింది అనేది నిజం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వం వహిస్తున్న ఇండియా కూటమిలోని నాయకుల హాజరు ప్రశ్నార్థకమే అనేది రాజకీయ పరిశీలకుల అంచనా. కర్ణాటక ప్రభుత్వ ఏర్పాటు సమయంలో వచ్చినంత మంది నాయకులు తెలంగాణలో రేవంత్ ప్రమాణ స్వీకారానికి హాజరు కాకపోవచ్చని అనుకుంటున్నారు. 

మొత్తమ్మీద  చూస్తే.. తెలంగాణ విజయం తెచ్చిన  ఆనందం కన్నా.. మిగిలిన రాష్ట్రాల్లో పరాజయం కాంగ్రెస్(Revanth Reddy Oath) పార్టీకి కంటిమీద కునుకు లేకుండా చేసే పరిస్థితి వచ్చింది అని నిపుణుల అభిప్రాయం. 

Watch this interesting Video:

#telangana #revanth-reddy #india-alliance
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe