Congress vs BRS : 'చేవలేక, చేతకాక..' కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ మధ్య 'కరువు' యుద్ధం!

కాంగ్రెస్,BRS మధ్య కరువు రాజకీయం మాటల యుద్ధానికి దారి తీసింది. చేవలేక, చేతకాక లోటు వర్షపాతం అంటూ రేవంత్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని కేటీఆర్ ఫైర్ అయ్యారు. గతేడాది తెలంగాణలో సాధారణం కంటే 14 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైందని కేటీఆర్ గుర్తుచేశారు.

New Update
Congress vs BRS  : 'చేవలేక, చేతకాక..' కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ మధ్య 'కరువు' యుద్ధం!

Fight Over BRS and Congress on Revanth Draught Comments : తెలంగాణ(Telangana) లో కరువు పరిస్థితులున్నాయని సీఎం రేవంత్‌(CM Revanth) చేసిన వ్యాఖ్యల రాజకీయ దుమారానికి దారితీశాయి. అన్ని రిజర్వాయర్లలో నీటి మట్టాలు తగ్గిపోతుండడంతో రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొంటున్నాయని, రైతులు పరిస్థితిని అర్థం చేసుకొని సమస్యను సమిష్టిగా ఎదుర్కొని అధిగమించేందుకు ప్రభుత్వానికి సహకరించాలని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. 'రైతు నేస్తం' కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా బుధవారం తన నివాసం నుంచి వర్చువల్‌ లింక్‌ ద్వారా రైతులతో సీఎం మాట్లాడారు. రేవంత్‌ వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ మండిపడుతోంది.

లోటు వర్షపాతం ఎక్కడ ఉంది?
కాంగ్రెస్(Congress), BRS మధ్య కరువు రాజకీయం మాటల యుద్ధానికి దారి తీసింది. చేవలేక,చేతకాక లోటు వర్షపాతం అంటూ రేవంత్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని కేటీఆర్ ఫైర్ అయ్యారు. గతేడాది తెలంగాణలో సాధారణం కంటే 14 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైందని కేటీఆర్ గుర్తుచేశారు.

'అబద్ధాలు, తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి నిరాధారమైన ప్రకటనలు చేస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత వారి తీరు చూసి తెలంగాణ ప్రజలు అసహ్యం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే, తెలంగాణ రైతులు తమ సమస్యలను పరిష్కరించడంలో అసమర్థత గురించి పూర్తిగా తెలుసుకున్నారు' అని అని ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఇక రేవంత్‌ కామెంట్స్‌పై మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ నిజస్వరూపం ప్రజలకు అర్థమైందని హరీశ్‌రావు విమర్శించారు.

రేవంత్ ఏం అన్నారు?
నిన్న రైతు నేస్తం(Rythu Nestham) కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్.. రిజర్వాయర్లలో నీళ్లు అడుగంటుతున్నాయన్నారు. అన్ని ప్రాంతాల్లో నీటి సమస్య తీవ్రంగా ఉందని రేవంత్ చెప్పారు. రాష్ట్రంలో కరువుపరిస్థితుల్ని కలిసికట్టుగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. నీళ్లు రిలీజ్ చేయాలంటూ కరీంనగర్‌, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్‌ రైతులు, నాయకులు డిమాండ్‌ చేస్తున్నారని.. అయితే రైతులంతా పరిస్థితిని అర్థం చేసుకోవాలన్నారు రేవంత్. రానున్న ఎండాకాలం నీటి సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. రేవంత్‌ కామెంట్స్‌, BRS కౌంటర్లతో తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది.

Also Read : ఏజెంట్ల డబ్బుల దాహం.. రష్యా యుద్ధోన్మాదం.. బలి అవుతున్న మన యువతరం!

Advertisment
Advertisment
తాజా కథనాలు