/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/450552756_1029014885249785_5775598166067536258_n.jpg)
Revanth Reddy: పుట్టుకతో కాలేయ సమస్యతో బాధపడుతున్న 3 ఏళ్ల బాలుడు ఆదిత్యకు విజయవంతంగా కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స జరిగింది. ఈ చికిత్సను అందించిన ఉస్మానియా జనరల్ ఆసుపత్రి వైద్యులు , పారా మెడికల్ సిబ్బందిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు.
కుమారుడి కోసం కాలేయం దానం చేసిన మాతృమూర్తి అమల, చికిత్స పూర్తి చేసుకున్నఆదిత్య పూర్తిగా కోలుకుని నిండునూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని రేవంత్ ఆకాంక్షించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇలాంటి అత్యుత్తమ సేవలు అందిస్తున్న వైద్యులు, ఇతర సిబ్బందికి ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.
Also read: అమెరికా నుంచి బ్రిటన్ వరకు.. ఎక్కడ చూసినా లీడర్లు మనోళ్లే!
 Follow Us
 Follow Us