/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/revanth-2-jpg.webp)
Telangana Farmers : అకాలు వర్షాలు(Sudden Rains), వడగళ్ల వానలు(Hail Showers) వల్ల పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 10 వేలు ఇవ్వాలని తెలంగాణ(Telangana) రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని ప్రణాళికలను సిద్దం చేసినట్లు అధికారులు వివరించారు. ఇప్పటి వరకు జరిగిన పంట నష్టాన్ని అంచనా వేయాలని వ్యవసాయాధికారులను రేవంత్ ప్రభుత్వం ఆదేశించింది.
రాష్ట్రంలో వచ్చే రెండు మూడు రోజులు వర్షాలు పడే అవకాశాలుండడంతో అప్పటి వరకు జరిగిన మొత్తం నష్టాన్ని అంచనా వేసి రైతులకు పరిహారం అందజేస్తామని రేవంత్ సర్కార్(Revanth Sarkar) చెబుతుంది. ఎన్నికల కోడ్(Election Code) అమల్లోకి వచ్చినప్పటికీ కూడా ఈసీ(EC) అనుమతి తీసుకుని మరీ రైతులకు పరిహారం అందించే అవకాశాలున్నట్లు అధికారులు ప్రకటించారు.
గతేడాది కూడా ఇలాగే తీవ్రమైన పంట నష్టం జరిగితే అప్పుడు కూడా ఎకరాకు రూ.10 వేలు అందించిన సంగతి తెలిసిందే. అదే విధంగా ఇప్పుడు కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వర్షాల నేపథ్యంలో రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. వ్యవసాయాధికారులంతా కూడా రైతులకు అందుబాటులో ఉండాలని తెలిపారు. కల్లాలో ఆరబోసిన ధాన్యం దెబ్బతినకుండా రైతులకు తగు సూచనలు ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Also Read : లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు నోటిఫికేషన్ విడుదల!