Murali Akunuri: బీఆర్ఎస్-బీఎస్పీ పొత్తుపై ఆకునూరి మురళి సంచలన వ్యాఖ్యలు

బీఆర్ఎస్‌తో బీఎస్పీ పొత్తు పెట్టుకోవడంపై మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో దుర్మార్గుడిగా కనిపించిన కేసీఆర్‌ ఇప్పుడు హీరో అయ్యాడా అని ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌ను నిలదీశారు. అన్యాయం పోలీస్ బాస్‌..ఇది కరెక్టు కాదు అని అన్నారు.

Murali Akunuri: బీఆర్ఎస్-బీఎస్పీ పొత్తుపై ఆకునూరి మురళి సంచలన వ్యాఖ్యలు
New Update

Akunuri Murali Comments On RS Praveen Kumar: రానున్న లోక్ సభ ఎన్నికలకు తెలంగాణలో బీఆర్ఎస్ తో బీఎస్పీ పొత్తు పెట్టుకోవడంపై (BRS - BSP Alliance) మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి ఘాటుగా స్పందించారు. బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ పై (RS Praveen Kumar) విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ తో బీఎస్పీ పొత్తు పెట్టుకోవడాన్ని ఎలా స్పందించాలో అర్ధం కావడం లేదని అన్నారు. గత రెండు సంవత్సరాలు బీఆర్ఎస్ మీద మీరు చెప్పినవన్నీ తప్పులు అయినట్టేనా? అని ప్రవీణ్ కుమార్ ను నిలదీశారు. అప్పుడు దుర్మార్గుడిగా కనపడిన కేసీఆర్ ఇప్పుడు హీరో ఆయిండా ? అని ప్రశ్నించారు. గాడిద మీద ఎక్కిఅయినా పర్లేదు మీరు ఎంపీ అవ్వాలసిందేనా ? అని అడిగారు. రేపు బీఆర్ఎస్ కేంద్రం లో ఎవరికీ సపోర్ట్ చేస్తుందో మీకు తెలియదా?.. రాజ్యాంగాన్ని ఎవరు రద్దు చేస్తారో మీకు తెలియదా ?.. రాజకీయాల్లో విలువలు ఉండవనే వాదనను మీరు కూడా అనుసరిస్తారా ? అని మండిపడ్డారు.

ALSO READ:

చీకటి మిత్రులు వెలుగులోకి..

బీఆర్ఎస్ - బీఎస్పీ పొత్తుపై మండిపడ్డారు విశారదన్ మహారాజ్‌ (Visharadan Maharaj). చీకటి మిత్రులు వెలుగులోకి వచ్చారంటూ విశారదన్ మహారాజ్ ట్వీట్ చేశారు. కేసీఆర్‌పై RS ప్రవీణ్ చేసిన యుద్ధం ఓ బూటకం అని ఫైర్ అయ్యారు. మరోవైపు RS ప్రవీణ్‌కుమార్‌కు బీఎస్పీ అధికార ప్రతినిధి వెంకటేష్ చౌహాన్ షాక్ ఇచ్చారు. BRSతో పొత్తును వ్యతిరేకిస్తూ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. 90 శాతం BSP నాయకులు RSP నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని అన్నారు. RSP తీరుతో బహుజన బిడ్డలు, స్వేరోస్ టీం ఆవేదన చెందుతున్నారని వెంకటేష్ చౌహాన్ అన్నారు.

Also Read: అన్యాయం జరుగుతోంది.. సీఎం రేవంత్‌కు హరీష్ రావు బహిరంగ లేఖ

#telangana-bsp #brs-alliance-with-bsp #rs-praveen-kumar #murali-akunuri #lok-sabha-elections-2024 #kcr
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe