తెలంగాణ డీజీపీకి గా..
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణకు డీజీపీగా పని చేశారు మహేందర్ రెడ్డి. ఆయన 2017 నవంబరు 17 నుండి 2022 డిసెంబరు 31 వరకు తెలంగాణ రాష్ట్ర డీజీపీగా పని చేశారు. మహేందర్ రెడ్డి హయాంలోనే తెలంగాణలో పోలీసులు, ప్రజల మధ్య మంచి ర్యాపొ పెంచేందుకు ఫ్రెండ్లి పోలీసింగ్.. అలాగే మహిళలకు సెక్యూరిటీ కొరకు షీ టీమ్స్ (She Teams) వంటివి అమల్లోకి తెచ్చారు. ఆయన సేవలను మరోసారి రాష్ట్రంలో కొనసాగించాలనే ఆలోచనలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ (Congress Party) మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని చైర్మన్‌గా నియమించింది.
Also Read: హెల్త్ ఇన్సూరెన్స్ తో క్యాష్‌లెస్ వైద్యం అన్ని ఆసుపత్రుల్లో
మహేందర్ రెడ్డి గురించి..
ఎం. మహేందర్ రెడ్డి 1986 బ్యాచ్‌కు చెందిన ఐ.పి.ఎస్ అధికారి. ఆయన తొలి పోస్టింగ్ కరీంనగర్ జిల్లా అసిస్టెంట్ సూపరింటెండెంట్. తరువాత గుంటూరులో, బెల్లంపల్లి లో పని చేసి నిజామాబాదు, కర్నూల్ జిల్లా ఎస్పీగా పని చేశాడు. 1995లో హైదరాబాద్ తూర్పు జోన్ డీసీపీగా పని చేసి, సర్దార్ వల్లభభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఫ్యాకల్టీగా, ఇంటెలీజెన్స్ చీఫ్, గ్రేహౌండ్స్ ఐజీగా పలు జిల్లాల్లో వివిధ హోదాల్లో పని చేశాడు. 2 జూన్ 2014న హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా నియమితుడయ్యాడు. డీజీపీ అనురాగ్ శర్మ పదవీవిరమణ చేయడంతో ఆయన 12 నవంబర్ 2017న ఇన్‌చార్జి డీజీపీగా నియమితుడై, 10 ఏప్రిల్ 2018న పూర్తి స్థాయి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ)గా నియమితుడయ్యాడు. ఆయన 8 ఏప్రిల్ 2020లో దేశంలోని టాప్ 25 ఐపిఎస్ అధికారుల జాబితాలో 8వ స్థానం దక్కించుకున్నాడు.
DO WATCH: