Hyderabad: ఫస్ట్ టైం హైదరాబాద్‌ పార్లమెంట్‌ ఫలితంపై ఉత్కంఠ.. ఎవరు గెలవబోతున్నారంటే!

హైదరాబాద్ పార్లమెంట్‌ ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఫస్ట్ టైం అసదుద్దీన్ తన గెలుపుపై ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. పక్కా ప్లాన్‌తో మాధవీలతను బీజేపీ బరిలోకి దించగా ఆమె దూకుడుతో అసదుద్దీన్‌కు చెమటలు పడుతున్నాయనే టాక్ వినిపిస్తోంది.

New Update
Hyderabad: ఫస్ట్ టైం హైదరాబాద్‌ పార్లమెంట్‌ ఫలితంపై ఉత్కంఠ.. ఎవరు గెలవబోతున్నారంటే!

Madhavi Latha Vs Asaduddin Owaisi: హైదరాబాద్ పార్లమెంట్‌ ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇన్నాళ్లు తన విజయానికి తిరుగులేదని నమ్మిన AIMIM అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ ఫస్ట్ టైం తన గెలుపుపై ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. పక్కా ప్లాన్‌తో మాధవీలతను బీజేపీ (BJP) బరిలోకి దించగా మాధవీలత దూకుడుతో అసదుద్దీన్‌కు చెమటలు పడుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. మొదటినుంచి ప్రచారంలోనూ అసదుద్దీన్‌కు గట్టిపోటీ ఇచ్చిన ఆమె గెలిచిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే మాట వినపడుతోంది.

ఇక హైదరాబాద్‌ పార్లమెంట్ పరిధిలో 46.08 శాతం పోలింగ్ నమోదైంది. హైదరాబాద్‌ పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా.. యాకత్‌పుర అసెంబ్లీ సెగ్మెంట్‌లో అత్యధికంగా 24 రౌండ్లు, చార్మినార్‌లో అత్యల్పంగా 15 రౌండ్‌లు పూర్తైనట్లు సమాచారం.

Also Read: ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ.. ఆ జిల్లాలో పోలీసులు హైఅలర్ట్‌..

Advertisment
తాజా కథనాలు