Parkinsons: పార్కిన్సన్స్ వ్యాధిని ఇలా గుర్తించొచ్చు.. సత్ఫలితాలనిస్తోన్న కొత్త పరీక్ష చేతులు, తల వణుకుతో ఇబ్బందులు పెట్టే పార్కిన్సన్ వ్యాధిని నిర్ధరించడం కష్టం. అమెరికా శాస్త్రవేత్తలు రూపొందించిన ‘అల్ఫా-సైన్యూక్లీన్ సీడ్ ఆంప్లికేషన్ అస్సే’ అనే పరీక్ష సత్ఫలితాలనిస్తోంది. తొలిదశలోనే ఈ వ్యాధిని గుర్తించేందుకు ఈ కొత్త పరీక్ష ఉపయోగపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. By B Aravind 06 Dec 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Parkinson's Symptoms : పార్కిన్సన్స్ (Parkinson's)వ్యాధికి గురైన వారిలో చేతులు, తల వణుకుతూ ఉంటాయి. కానీ ఈ జబ్బును నిర్ధరించడం చాలా కష్టం. ఇప్పటికూడా ఈ వ్యాధిని గుర్తించేందుకు నిర్ధిష్టమైన పరీక్షేది లేదు. చాలావరకు లక్షణాల ఆధారంగానే గుర్తిస్తారు. మొదటిదశలో కనిపించే మలబద్ధకం, కుంగుబాటు, నిద్ర పట్టకపోవడం వంటి లక్షణాలు ఇతర జబ్బులతో కూడా ముడిపడి ఉంటాయి. దీంతో ఈ సమస్యను పార్కిన్సన్స్‌తో పోల్చుకోవడం ఆలస్యమవుతుంది. తల, చేతులు వణకడం, బిగుసుకుపోవడం లాంటివి మొదలైనప్పుడు సమస్య తీవ్రతరమవుతుంది. అందుకే ఈ వ్యాధిని తొలి దశలో, లక్షణాలు (Symptoms)ఆరంభం కావడానికి ముందే గుర్తించేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ దిశగా అమెరికా శాస్త్రవేత్తలు రూపొందించిన ‘అల్ఫా-సైన్యూక్లీన్ సీడ్ ఆంప్లికేషన్ అస్సే’ అనే పరీక్ష సత్ఫలితాలనిస్తోంది. Also read: తెలంగాణ రెండో సీఎంగా రేవంత్ రెడ్డి.. ఆయన ఫుల్ ప్రొఫైల్ ఇదే! మెదడులో, నాడి వ్యవస్థలో అల్ఫా-సైన్యూక్లీన్ ప్రోటీన్లు పోగుపడటం పార్కిన్సన్స్ సమస్యకు దారితీస్తుంది. దీంతో వణుకు రావడం, శరీరంలో కదలికలు నెమ్మదించడం, కండరాలు బిగుసుకుపోవడం వంటి లక్షణాలు ఆరంభం కావడానికి చాలా ఏళ్ల ముందుగానే ఈ ప్రోటీన్లు పొగుపడుతూ వస్తాయని భావిస్తుంటారు. కొత్త పరీక్షకు ఇవే ఆధారం కానున్నాయి. ఇది వెన్నుద్రవంలో అల్ఫా-సైన్యూక్లీన్ ప్రోటీన్ల మోతాదులను పట్టి చూపుతుంది. దీనివల్ల పార్కిన్సన్స్ జబ్బును 88 శాతం కచ్చితంగా గుర్తించేందుకు వీలుంటుంది. అలాగే తొలిదశలోనే ఈ వ్యాధిని గుర్తించేందుకు .. దీని ముప్పు తెలుసుకునేందుకు ఈ కొత్త పరీక్ష ఉపయోగపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. Also Read: సీఎం పదవిపై రేవంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్.. వారికి థ్యాంక్స్ చెబుతూ ట్వీట్.. #telugu-news #health-tips #parkinsons #parkinsons-symptoms మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి