Wayanad: ఇంకా 130 మంది గల్లంతు..వెతుకుతున్న రెస్క్యూ టీమ్

వయనాడ్‌లో ఇంకా విషాదకర పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ కొసాగుతూనే ఉంది. ఇప్పటికి 200 మృతదేహాలను గుర్తించారు. ఇంకా 130 మంది ఆచూకీ లభించలేదని అధికారులు చెబుతున్నారు. వీరి కోసం గాలింపు చర్యలు చేస్తున్నారు.

New Update
Wayanad: ఇంకా 130 మంది గల్లంతు..వెతుకుతున్న రెస్క్యూ టీమ్

Rescue Operation : వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మొత్తం 229మంది చనిపోయారని కేరళ ప్రభుత్వం ప్రకటించింది. వీరిలో ఇప్పటికి 200 మంది మృతదేహాలు మాత్రమే దొరికాయి. మరో 129 మంది ఆచూకీ లభించలేదు. ఈ మృతదేహాల గురించి వయనాడ్‌లోని చలియా నది, అక్కడ అటవీ ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన జరిగి ఇప్పటికి 20 రోజులపైనే అయింది. అయినా కూడా ఇంకా మృతదేహాల ఆచూకీ దొరకలేదు. దొరికిన 200మందిలో కూడా ఇంకా 51 మందిని గుర్తించాల్సి ఉంది. వీరికి సంబంధించిన డీఎన్‌ఏ నివేదిక ఆగస్టు 13లోగా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే వయనాడ్ నుంచి కొంత రెస్క్యూ బృందం వెళ్ళిపోయింది. కానీ ఇంకా ఎన్డీఆర్‌ఎఫ్‌, పోలీస్‌, అగ్నిమాపక, అటవీశాఖలకు చెందిన 190 మంది సభ్యుల బృందం.. మాత్రం వరదలు వచ్చిన ప్రాంతంలో అణువణువూ జల్లెడ పడుతున్నారు. చలియార్ నది, దానికి దగ్గరలో ఉన్న అటవీ ప్రాంతంలో గాలింపు చేస్తున్నారు. ఇప్పటికే అన్ని ప్రాంతాలను ఒకసారి గాలించేశారు. ఇప్పుడు మళ్ళీ మరొక సారి వెతుకుతున్నారు. ఎగువ ప్రాంతం మొత్తం పూర్తికాగా, ప్రస్తుతం దిగువన తమ సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగుతోందని..ఏడీజీపీ ఎం ఆర్‌ అజిత్‌ కుమార్‌ తెలిపారు. ప్రస్తుతం నీటి ప్రవాహం స్థాయిలు తగ్గాయి. దీంతో మృతదేహాలు బయటకు వస్తున్నాయి. అయితే ఇంకా వర్షాలు మాత్రం తగ్గడం లేదు. అది కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. దీని వలన కూడా కొంత సెర్చింగ్‌కు అంతరాయం ఏర్పడుతోంది. ఇవన్నీ కాక..20 రోజులకు పైగా అయిపోవడంతో మృతదేహాలు చెల్లాచెదురు అయిపోయాయి. శరీర భాగాలు వేరు వేరు అయిపోయాయి. దాంతో కొంతమందివి కొన్ని భాగాలు మాత్రమే లభ్యం అవుతున్నాయి.

Also Read: Railways: లోవర్ బెర్త్‌లకు ఫుల్ డిమాండ్..రూల్స్ సెట్ చేసిన రైల్వే

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు