Khammam: రేణుకా చౌదరి ముఖ్య అనుచరుడి పై కత్తితో దాడి..పరిస్థితి విషమం!

ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ముఖ్య అనుచరుడు సూరంపల్లి రామారావు పై గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం రాత్రి కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో సూరంపల్లికి తీవ్ర గాయాలు అయ్యాయి.

New Update
Khammam: రేణుకా చౌదరి ముఖ్య అనుచరుడి పై కత్తితో దాడి..పరిస్థితి విషమం!

ఖమ్మం (Khammam) జిల్లా వైరా (Vyra)నియోజకవర్గంలో రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి (Renuka Choudary)  ముఖ్య అనుచరుడు సూరంపల్లి రామారావు (Surampalli Ramarao) పై గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం రాత్రి కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో సూరంపల్లికి తీవ్ర గాయాలు అయ్యాయి. గతంలో ఉన్న పాత కక్షల వల్లే ఈ దాడి జరిగినట్లు స్థానికులు, కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో సూరంపల్లి బాత్‌ రూమ్‌ నుంచి బయటకు వస్తుండగా అప్పటికే అక్కడ కాపు కాసిన ముగ్గురు ముసుగు వ్యక్తులు ఆయన పై ఒక్కసారిగా కత్తులతో దాడి చేశారు. కడుపులో కత్తితో పలుమార్లు పొడవడంతో తీవ్రంగా గాయపడిన రామారావు కేకలు వేయడంతో అప్పుడే ఓ వివాహ వేడుకలో పాల్గొని వస్తున్న కొందరు స్థానికులు వారిని చూడడంతో దుండగులు పారిపోయారు. దీంతో రామారావుని వారు స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

భూవివాదాల వల్లే కొణిజర్ల కు చెందిన కొంతమంది వ్యక్తులు ఈ దాడి చేసినట్లు తెలుస్తుంది. ఈ విషయం గురించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. కొణిజర్ల గ్రామంలో ఎలాంటి అవంచానియా ఘటనలు జరక్కుండా 144సెక్షన్ అమలు చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు.

Also read: ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది మృతి… 21 మందికి తీవ్ర గాయాలు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు