/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/renu-jpg.webp)
Renu Desai Post : నటి రేణు దేశాయ్(Renu Desai) గురించి ఎవరికీ ప్రత్యేకంగా చెప్పానవసరం లేదు. తెలుగు చిత్ర పరిశ్రమ(Telugu Film Industry) లో నటిగా, కాస్ట్యూమ్ డిజైనర్ గా, మోడల్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) సరసన బద్రి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన ఈమె.. ఆ తరువాత పవన్ ని పెళ్లి చేసుకుని మెగా కోడలు అయ్యింది. ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత వారు విడాకులు తీసుకుని విడిగా ఉంటున్నారు.
మెగా కుటుంబం నుంచి వేరు అయినప్పటికీ రేణు సోషల్ మీడియా(Social Media) లో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన గురించి, పిల్లల గురించి అన్ని అప్ డేట్ లను ఎప్పటికప్పుడూ ఇస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. కేవలం వ్యక్తిగత విషయాలను మాత్రమే కాకుండా అప్పుడప్పుడు రాజకీయాల గురించి కూడా రేణు మాట్లాడుతుంటుంది. అంతేకాకుండా అప్పుడప్పుడు రాజకీయాల గురించి కూడా ఆమె మాట్లాడుతుంటారు.
తాజాగా రేణు పెట్టిన పోస్ట్ ఒకటి నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ పోస్ట్ లో రేణు తన చేతికి ఉన్న పచ్చబొట్టును చూపిస్తూ .. ‘కొన్నిసార్లు చిత్రం పదాల కంటే బిగ్గరగా మాట్లాడుతుంది (నా పచ్చబొట్టు మౌనం పరమ శీలం అని చెబుతుంది)’ అంటూ పోస్ట్ పెట్టింది. అయితే..ఈ పోస్ట్ కు రాజకీయాలకు ఎలాంటి సంబంధం ఉంది అనుకుంటున్నారా... ఉంది.. ఎందుకంటే ఆమె చేతి మీద కమలం గుర్తు కూడా ఉంది. ఆమె పెట్టిన కొటేషన్ చివరిలో ఎలక్షన్ 2024(Elections 2024) అనే హ్యష్ ట్యాగ్ ను కూడా జోడించింది.
దీంతో ఇప్పుడు రేణు దేశాయ్ పోస్ట్ నెట్టంట హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఎలక్షన్స్‌ను ఎందుకు గుర్తుచేసింది. రేణు ఎవరకి సపోర్ట్‌గా ఉంటోంది అంటూ సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలు అయ్యింది.
Also read: ఆర్వో మిషన్ లేకపోయినా నీటిని శుద్ది చేయోచ్చు..ఎలాగో చూసేద్దామా!
/rtv/media/media_files/2025/08/05/brush-your-teeth-2025-08-05-10-36-27.jpg)