Renu Desai : పవన్ కళ్యాణ్ కు విషెష్ తెలిపిన రేణు దేశాయ్.. ప్రమాణ స్వీకారానికి వెళ్లిన అకీరా,ఆద్య!

పవన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా రేణు దేశాయ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే ఇన్‌స్టాగ్రామ్ లో అకీరా, ఆద్య ఫొటోలను పంచుకున్నారు. తనకు వీడియో కాల్‌ చేసినట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు మంచి చేయాలనుకొనే కల్యాణ్ గారికి శుభాకాంక్షలు’ అంటూ పోస్ట్‌ పెట్టారు.

Renu Desai : పవన్ కళ్యాణ్ కు విషెష్ తెలిపిన రేణు దేశాయ్.. ప్రమాణ స్వీకారానికి వెళ్లిన అకీరా,ఆద్య!
New Update

Renu Desai Wishes To Pawan Kalyan : ఏపీ రాష్ట్ర మంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారోత్సవాన్ని ప్రత్యక్షంగా చూడటానికి మెగా కుటుంబం అంతా తరలి వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి సురేఖ, రామ్ చరణ్ కొడుకు అకీరా నందన్, కూతురు ఆద్య, భార్య అన్నా లెజినోవా విజయవాడ దగ్గర కేసరపల్లిలో జరిగిన అద్భుతమైన వేదిక వద్దకు వచ్చారు. వేదిక మీద చిరంజీవి అనుక్షణం పవన్ కళ్యాణ్ ను చూసి మురిసిపోతుంటే, వేదిక కింద నుంచి చూస్తున్న మెగా ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ ప్రమాణం చేస్తున్నపుడు తమ భావోద్వేగాలను ఆపుకోలేకపోయారు.

publive-image

కాగా పవన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా అయన మాజీ భార్య రేణు దేశాయ్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే తన ఇన్‌స్టాగ్రామ్ లో అకీరా, ఆద్య ఫొటోలను పంచుకున్న రేణూదేశాయ్‌ తనకు వీడియో కాల్‌ చేసినట్లు చెప్పారు. ‘వాళ్ల నాన్న బిగ్గెస్ట్‌ డేకు రెడీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌కు మంచి చేయాలనుకొనే కల్యాణ్ గారికి శుభాకాంక్షలు’ అంటూ పోస్ట్‌ పెట్టారు. దీంతో రేణు దేశాయ్ పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

Also Read : పవన్ కుటుంబ భావోద్వేగం.. మెగా బ్రదర్స్ తో ప్రధాని మోదీ లాస్ట్ పంచ్! ఫ్యాన్స్ కు పూనకాలు!!

publive-image

కాగా ఈ ప్రమాణస్వీకారానికి అకీరా నందన పంచె కట్టులో వచ్చి అందర్నీ ఆకర్షించాడు. చిరంజీవితో పాటు నాగబాబు, సాయి ధరమ్‌ తేజ్‌, రామ్‌ చరణ్‌, అకీరా, ఆద్య మెగా ఫ్యామిలీ మొత్తం ప్రత్యేక బస్సులో ప్రమాణ స్వీకరానికి వెళ్లారు. ప్రస్తుతం అందుకు సంబంధించి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి.


#pawan-kalyan #renu-desai
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe