Renu Desai:నాకు పెళ్లి చేసుకోవాలని ఉంది.. త్వరలోనే రెండోపెళ్లి.. రేణూ దేశాయ్ కీలక ప్రకటన..

'నాకు పెళ్లిపై మంచి అభిప్రాయం ఉంది. పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కూడా ఉంది. పెళ్లి చేసుకోవడానికి వెయిట్ చేస్తున్నాను. నా పిల్లలు కూడా పెళ్లికి అంగీకరించారు. నా కొడుకు ఎప్పుడూ పెళ్లి చేసుకోమనే చెప్తాడు.' అంటూ రేణూ దేశాయ్ కీలక విషయాలు వెల్లడించింది.

Renu Desai:నాకు పెళ్లి చేసుకోవాలని ఉంది.. త్వరలోనే రెండోపెళ్లి.. రేణూ దేశాయ్ కీలక ప్రకటన..
New Update

Renu Desai Second Marriage: పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan)తో విడిపోయిన తరువాత రేణు దేశాయ్(Renu Desai) 2018లో రెండో పెళ్లికి సిద్దమయ్యారు. ఆ సమయంలో ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకుంది. కానీ, ఏమైందో తెలియదు కానీ.. కొద్దిరోజుల తరువాత ఆ పెళ్లి ఊసే లేకుండా పోయింది. ఈ కారణాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు రేణూ దేశాయ్. అంతేకాదు.. మళ్లీ పెళ్లి చేసుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, తన పిల్లలు కూడా ఇందుకు అంగీకరించారని వెల్లడించింది. తన రెండో పెళ్లిపై (Second Marriage) , ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ చేసుకోవడంపై రేణు దేశాయ్ చెప్పిన ఇంట్రస్టింగ్ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం..

ఇదికూడా చదవండి: Gold Rates Today: అతివలకు అదిరిపోయే న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. ఇవాళ ఎంతంటే..

ఇంటర్వ్యూలో రేణు దేశాయ్ మాట్లాడుతూ 'నా పర్సనల్ లైఫ్ గురించి అందరికీ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. నాకు రైట్ పర్సన్ అనిపించిన వ్యక్తిని పెద్దల అంగీకారంతోనే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. ఆ ప్రకారమే అందరి అంగీకారంతోనే ఎంగేజ్‌మెంట్ చేసుకున్నా. కానీ ఆ తరువాత.. పిల్లలున్నారు.. వాళ్లకి తోడుగా ఉండాలి.. నువ్వు ఎలా ఉంటావ్.. అని చాలా మంది క్వశ్చన్ చేశారు. అప్పటికే నేను ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాను. ఫొటోస్ కూడా బయటకు వచ్చాయి. అది పెద్ద న్యూస్ అయిపోయింది. కానీ, ఆ తరువాత నేను రియలైజ్ అయ్యాను. నా కూతురు గురించి ఆలోచించి బ్యాక్ స్టెప్ తీసుకున్నాను. ఎందుకంటే నా కూతురు వయసు అప్పుడు కేవలం ఏడేళ్లు. ఒకవేళ నేను పెళ్లి చేసుకుంటే.. నేను అతనికి సమయం ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు పిల్లలకు కాస్త దూరమవ్వాల్సి వస్తుంది. అందుకే.. నేను నా కూతురు కోసం ఆలోచించాను. తను చాలా చిన్నమ్మాయి. ఆ వయసులోనే నేను ఎక్కువగా తనతో ఉండాలి.

ఇప్పటికే తండ్రి లేడు.. ఇప్పుడు ఉన్న తల్లి కూడా వేరే వ్యక్తితో ఉంటే.. ఆ పిల్లల పరిస్థితి బాగోదని ఆలోచించాను. అందుకే ఆ పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నాను. ఇప్పుడు నా కూతురు వయసు 13 ఏళ్లు.. అప్పుడు ఏడేళ్లు. ఆ టైంలో నేను అలాంటి నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదనిపించింది. నాకు పెళ్లిపై మంచి అభిప్రాయం ఉంది. పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కూడా ఉంది. పెళ్లి చేసుకోవడానికి వెయిట్ చేస్తున్నాను. ఆధ్య (Aadya) కాలేజ్‌కి వెళ్లిన తరువాత నా గురించి నేను ఆలోచిస్తాను.' అని చెప్పుకొచ్చారు రేణూ దేశాయ్.

అకీరా ఇదే చెప్పాడు..

'నేను పెళ్లి చేసుకోవడం నా పిల్లలకు ఇష్టమే. వాళ్లు హ్యాపీగానే ఉన్నారు. పెళ్లి అనేది నా అభిప్రాయం. నా పిల్లలు నాకు దేవుడిచ్చిన వరం. ఒక వ్యక్తి వల్ల నువ్వు సుఖంగా సంతోషంగా ఉంటావ్ అంటే.. హ్యాపీగా పెళ్లి చేసుకో మమ్మీ అని నా కొడుకు అకిరా నందన్ (Akira Nandan) అన్నాడు. మా మధ్య నా పెళ్లి గురించి మాట్లాడుకుంటాం.. నా కొడుకు ఎప్పుడూ పెళ్లి చేసుకోమనే చెప్తాడు. నీకు ఒక వ్యక్తి నచ్చితే.. అతనితో నువ్వు హ్యాపీగా ఉంటానంటే పెళ్లి చేసుకో మమ్మీ అని చాలాసార్లు చెప్పాడు. కానీ వాళ్లకి టైం ఇవ్వాలని పెళ్లిని కొన్నాళ్లు దూరం పెట్టాను. ఇంకో రెండేళ్లలో పిల్లలు పెద్దవాళ్లు అవుతారు. అప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తాను.' అని క్లారిటీ ఇచ్చారు రేణు దేశాయ్.

ఇదికూడా చదవండి: మనిషి కాదు రాక్షసి.. ఏడుస్తోందని చిన్నారిని చిదిమేసింది.. ఎక్కడ జరిగిందంటే..

#renu-desai #renu-desai-interview #renu-desai-second-marriage
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe