/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-16T100351.586.jpg)
Pawan Kalyan: మంగళవారం వెలువడిన ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ భారీ మెజారిటీతో పిఠాపురం ఎమ్మెల్యేగా విజయకేతనం ఎగురవేశారు. తన సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి వంగా గీతపై 70 వేలకుపైగా మెజారిటీతో ఘన విజయం సొంతం చేసుకున్నారు. దీంతో జనసేనాని గెలుపుపై సినీ పరిశ్రమలోని నటీనటులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే భారీ సంఖ్యలో అభిమానులు పవన్ ఇంటికి చేరుకోగా.. సినీ సెలబ్రెటీలు ఆయనకు అభినందనలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. సాయి ధరమ్ తేజ్, నితిన్, మెగాస్టార్ చిరంజీవి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పవన్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెట్టిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే పవన్ గెలుపుపై ఆయన మాజీ భార్య రేణూ దేశాయ్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. "ఆద్య, అకీరాలు ఎంతో ఆనందంగా ఉన్నారు. ఈ తీర్పు వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ప్రయోజనం పొందుతారని ఆశిస్తున్నాను" అంటూ తన కుమార్తె ఆధ్య సంతోషంగా ఉన్న క్షణాలను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం రేణూ దేశాయ్ పోస్టుపై నెటిజన్లతో పాటు అటు పవన్ అభిమానులు కూడా స్పందిస్తున్నారు.
View this post on Instagram
Also read: 15 ఏళ్ల తరువాత ఎమ్మెల్యేగా టీడీపీ జెండా ఎగరేసిన అంగన్వాడీ టీచర్..!
Follow Us