Renu Desai: మీకు నా శాపం తగులుతుంది.. నెటిజన్లపై దుమ్మెత్తిపోసిన పవన్ మాజీ భార్య!

పవన్- అనా లెజినొవా దంపతులు అకీరా నందన్‌, ఆద్యలతో దిగిన ఫొటోపై వల్గర్ మీమ్స్ క్రియేట్ చేస్తున్న వారిపై రేణూ దేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మమ్మల్ని ఎగతాళి చేసే మీకూ ఇంట్లో తల్లి, అక్కాచెల్లెళ్లు, కూతుర్లు ఉంటారని గుర్తుంచుకోవాలంటూ తిట్టిపోసింది.

Renu Desai: మీకు నా శాపం తగులుతుంది.. నెటిజన్లపై దుమ్మెత్తిపోసిన పవన్ మాజీ భార్య!
New Update

Pawan kalyan family: సోషల్ మీడియా వేదికగా తనను, తన పిల్లలు, కుటుంబంపై అభ్యంతరకర కామెంట్స్ చేస్తు్న్న వారిపై రేణూ దేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల ఫ్యామిలీ మెంబర్స్ ను ఎగతాళి చేసే వారికి కూడా ఇంట్లో ఒక తల్లి, అక్కాచెల్లెళ్లు, కూతుర్లు ఉంటారని గుర్తుంచుకోవాంటూ శాపనార్ధాలు పెట్టింది. ఈ మేరకు ఇటీవల ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్- అనా లెజినొవా దంపతులు అకీరా నందన్‌, ఆద్యలతో సరదాగా దిగిన ఫొటో నెట్టింట పోస్ట్ చేశారు. అయితే ఇది తెగ వైరల్ కావడంతో మీమ్స్, ట్రోల్స్ క్రియేట్ చేస్తూ నెటిజన్లు రెచ్చిపోయారు. దీంతో మనుషులు ఇంత దారుణంగా తయారవడం సిగ్గుచేటు అంటూ ఇన్‍స్టా వేదికగా రేణూ పోస్ట్ పెట్టింది.

'ఆ ఫొటోను నేను ఏ విధంగా క్రాప్‌ చేస్తానని, ఎలా పోస్టు చేస్తానని మీమ్స్‌, జోక్‌లు చేసే వారంతా మీకూ ఒక కుటుంబం ఉందని గుర్తుంచుకోండి. తన తల్లిని ఎగతాళి చేసేలా ఉన్న ఒక పోస్టును ఇన్‌స్టాలో చూసి నా కూతురు చాలా ఏడ్చింది. సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులను ఎగతాళి చేసే మీకూ ఇంట్లో తల్లి, అక్కాచెల్లెళ్లు, కూతుర్లు ఉంటారని గుర్తుంచుకోండి. ప్రముఖ వ్యక్తులకు సంబంధించిన సోషల్‌మీడియా, ఇంటర్నెట్‌ అకౌంట్లను సులభంగా యాక్సెస్‌ చేసి, విచక్షణ లేని వ్యక్తులుగా ఎదుగుతున్న తీరును చూస్తుంటే నిజంగా అసహ్యం వేస్తోంది. ఈ రోజు నా కుమార్తె ఎంతో బాధ అనుభవించింది. ఆమె కన్నీళ్లు కర్మ రూపంలో మిమ్మల్ని వెంటాడతాయని గుర్తుంచుకోండి. పొలినా, మార్క్‌ (అన్నా లెజినోవా, పవన్ కళ్యాణ్ పిల్లలు) సైతం ఇలాంటి విచక్షణ లేని కామెంట్లు, మీమ్స్‌తో ప్రభావితం అవుతారు. ఇలాంటి మీమ్‌ పేజీలను నిర్వహించేవారు సమాజంలో అత్యంత భయంకరమైన వ్యక్తులు. ఈ తల్లి శాపం మీకు కచ్చితంగా తగులుతుంది. ఈ పోస్ట్ చేయడానికి ముందు 100 సార్లు ఆలోచించా.. కానీ నా కూతురు అనుభవించిన బాధను వ్యక్తం చేసేందుకు చెప్పాల్సి వచ్చింది' అంటూ ఆందోళన వ్యక్తం చేసింది.

#pawan-kalyan #akira-nandan #renu-desai
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe