Akira Nandan : ప్రభాస్ 'కల్కి' మూవీ చూసేందుకు థియేటర్ కు వచ్చిన అకీరా, రేణు దేశాయ్.. వైరల్ అవుతున్న వీడియో!

'కల్కి' మూవీ చూసేందుకు పవన్ మాజీ భార్య రేణు దేశాయ్, అకీరాతో కలిసి థియేటర్ కి వచ్చారు. ఈ రోజు ఉదయం హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమ్యాక్స్ థియేటర్ దగ్గర పవన్ కొడుకు అకీరా నందన్ తన ఫ్రెండ్స్ తో కలిసి సందడి చేశాడు. అకీరాతో పాటూ రేణు దేశాయ్ కూడా రావడం విశేషం.

New Update
Akira Nandan : ప్రభాస్ 'కల్కి' మూవీ చూసేందుకు థియేటర్ కు వచ్చిన అకీరా, రేణు దేశాయ్.. వైరల్ అవుతున్న వీడియో!

Renu Desai And Akira At Kalki Movie Theatre : దేశ వ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తూ వచ్చిన ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ 'కల్కి' నేడు థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఎర్లీ మార్నింగ్ షోస్ తోనే మొదలైన ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ అయితే బ్లాక్ బస్టర్ బొమ్మ అని ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు.

మరోవైపు టాలీవుడ్ సెలెబ్రిటీలు సైతం ఈ సినిమా రిలీజ్ సందర్భంగా మూవీ టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరికొందరేమో సినిమా చూసేందుకు స్వయంగా థియేటర్స్ కి వస్తున్నారు. ఈ క్రమంలోనే కల్కి మూవీ చూసేందుకు పవన్ మాజీ భార్య రేణు దేశాయ్, అకీరాతో కలిసి థియేటర్ కి వచ్చారు. ముఖ్యంగా అకీరా ఏకంగా కల్కి టీ షర్ట్ వేసుకొని ఫ్రెండ్స్ తో సినిమాకు రావడం ఆసక్తికరంగా మారింది.

Also Read : ‘కల్కి’ కోసం నా చెప్పులు కూడా అరిగిపోయాయి : నాగ్ అశ్విన్

ఈ రోజు ఉదయం హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమ్యాక్స్ థియేటర్ దగ్గర పవన్ కొడుకు అకీరా నందన్ తన ఫ్రెండ్స్ తో కలిసి సందడి చేశాడు. అకీరాను చూసిన ఫ్యాన్స్ సెల్ఫీల కోసం ఎగబడ్డారు. అది గమనించిన అకీరా థియేటర్ లోపలికి వెళ్లి లిఫ్ట్ ఎక్కాడు. అక్కడ అకీరాతో పాటూ రేణు దేశాయ్ కూడా ఉండటం విశేషం. ఇక అకీరాను చూసిన ఫ్యాన్స్ ఫ్యూచర్ పవర్ స్టార్, జై జనసేన, జై పవర్ స్టార్ అనే నినాదాలు ఇస్తూ తెగ హడావిడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ వీడియోను నెట్టింట తెగ షేర్ చేస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు