Job Mela: మహిళలకు గుడ్‌న్యూస్.. RNLIలో ఉద్యోగాల జాతర!

వరంగల్‌లోని రిలయన్స్ నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్ కో లిమిటెడ్ కంపెనీ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. 50 లైఫ్ ప్లానింగ్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం ఆగస్టు 20న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి ఉమారాణి తెలిపారు. ములుగు రోడ్డు ఐటీఐ ప్రాంగణంలో సెలక్షన్ ప్రక్రియ ఉంటుంది.

New Update
Job Mela: మహిళలకు గుడ్‌న్యూస్.. RNLIలో ఉద్యోగాల జాతర!

Warangal: తెలంగాణలోని వివాహిత మహిళలకు రిలయన్స్ నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్ కో లిమిటెడ్ కంపెనీ శుభవార్త చెప్పింది. ఆగస్టు 20 నుంచి సదరు కంపెనీకి సంబంధించిన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు వరంగల్ జిల్లా ఉపాధి కల్పనాధికారి ఉమారాణి తెలిపారు. ఈ మేరకు వరంగల్ లోని రిలయన్స్ నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్ కో లిమిటెడ్ కంపెనీలో 50 లైఫ్ ప్లానింగ్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయనుండగా.. ములుగు రోడ్డు ఐటీఐ ప్రాంగణంలో సెలక్షన్ ప్రక్రియ ఉంటుందని ప్రకటన విడుదల చేశారు.

విద్యా అర్హతలు:
ఈ ఉద్యోగాలకు డిగ్రీ పూర్తిచేసిన వారు అర్హులు.

బయోడేటా, సర్టిఫికేట్లు:
అభ్యర్థులు బయోడేటా, విద్యార్హత సర్టిఫికేట్లు తప్పనిసరిగా తీసుకురావాలి.

మరిన్ని వివరాలకోసం: 95735 85532 నంబర్‌కు ఫోన్ చేయాలని ఉమారాణి సూచించారు.

Advertisment
తాజా కథనాలు