Relaince Viacom 18 Deal: వయాకామ్ పెద్ద బాగాన్ని రిలయన్స్ ఇండస్ట్రీ సొంతం చేసుకోబోతోంది. దీనికి సంబంధించి వయాకామ్ 18 మీడియా ప్రైవేట్‌లో రెండో వాటాను కొనుగోలు చేసేందుకు పారామౌంట్ గ్లోబల్‌కు చెందిన రెండు అనుబంధ సంస్థలతో ముఖేష్ అంబానీ గురువారం బైండింగ్ ఒప్పందంపై సంతకం చేశారు. పారామౌంట్ గ్లోబల్‌లో 13.01% వాటాను రిలయన్స్ ఇండస్ట్రీ కొననుంది. ఈ మొత్తం వాటాను రూ. 4, 286 కోట్ల ఇచ్చి రిలయన్స్ ఇండస్ట్రీ సొంతం చేసుకుంటోంది. ఇలా వయాకామ్‌లో...రిలయన్స్ వాటాను కొనడం ఇది రెండవసారి. ఈ లావాదేవీ పూర్తయిన తర్వాత Viacom18లో రిలయన్స్ మొత్తం ఈక్విటీ వాటా 70.49%కి పెరుగనుంది.
వయాకామ్ 18 అనేది TV18 బ్రాడ్‌కాస్ట్ లిమిటెడ్‌కు మెటీరియల్ అనుబంధ సంస్థ. ఇంతకు ముందు కూడా ఇందులో ఒక వాటాను రిలయన్స్ ఇండస్ట్రీ కొనుగోలు చేసింది. అప్పుడు 57.48% వాటాను కొనుగోలు చేసింది. దీని ద్వారా Viacom18లో కంపల్సరీగా కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్‌లను రిలయన్స్ కలిగి ఉంది. దీంతో ఫిబ్రవరిలో ప్రకటించిన రిలయన్స్ ఇండస్ట్రీ -డిస్నీ విలీనం కూడా పూర్తవుతుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పుడు రిలయన్స్ వాటాను కొన్నాక కూడా పారామౌంట్ గ్లోబల్ తన కంటెంట్‌ను వయాకామ్ 18కి లైసెన్స్‌తోనే కొనసాగిస్తుందని తెలిపారు.
డిస్నీతో ఒప్పందం..
రిలయన్స్(Reliance) మీడియా – ఎంటర్టైన్మెంట్ రంగంలో టాప్ ప్లేస్ పై కన్నేసింది. ఇప్పటికే ప్రతి రంగంలోనూ తనదైన శైలిలో దూసుకుపోతున్న రిలయన్స్.. ఇప్పుడు మీడియా-ఎంటర్టైన్మెంట్ రంగంలోనూ నెంబర్ 1 స్థానం కోసం పెద్ద ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ తో దేశంలోనే అతి పెద్ద మీడియా-ఎంటర్టైన్మెంట్ కంపెనీగా రిలయన్స్ అవతరించింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(RIL) అమెరికన్ మీడియా కంపెనీ వాల్ట్ డిస్నీ భారతీయ వ్యాపారాన్ని కొనుగోలు చేయడానికి నాన్-బైండింగ్ టర్మ్ షీట్ (ఒప్పందం)పై(Reliance Walt Disney Deal) సంతకం చేసింది. మీడియా నివేదికల ప్రకారం, ఈ ఒప్పందం ద్వారా డిస్నీలో RIL కనీసం 51% వాటాను కొనుగోలు చేస్తుంది. దీని తరువాత, రిలయన్స్ భారతదేశంలో అతిపెద్ద మీడియా – వినోద వ్యాపారాన్ని కలిగి ఉంటుంది.
మీడియా రిపోర్ట్స్ ప్రకారం, ఈ డీల్ 51:49 స్టాక్ – నగదు విలీనం అవుతుంది. ఇది వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి అంటే 2024 నాటికి పూర్తవుతుంది. అయితే రిలయన్స్ తన రెగ్యులేటరీ అనుమతులు, వాణిజ్య అవసరాలు అన్నీ జనవరి నాటికి పూర్తి చేసేందుకు సిద్ధమవుతోంది.
నియంత్రణ వాటాలతో రిలయన్స్
ఈ డీల్(Reliance Walt Disney Deal) తర్వాత, డిస్నీ స్టార్ వ్యాపారంలో రిలయన్స్ నియంత్రణ వాటాలను పొందుతుంది. దీని అంచనా విలువ 10 బిలియన్ డాలర్లు అంటే రూ. 83,163 కోట్లు. ఒప్పందం పూర్తయిన తర్వాత, డిస్నీకి ఈ వ్యాపారంలో మైనారిటీ వాటాలు మాత్రమే ఉంటాయి.
Also Read: Telangana: రేవంత్‌రెడ్డి సర్కార్ మరో సంచలన నిర్ణయం.. కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు