BJP: 17పార్లమెంటు స్థానాలకు ఇంఛార్జిలను నియమించిన బీజేపీ.. జాబితా ఇదే తెలంగాణ రాష్రంలోని అన్ని లోక్‌సభ నియోజకవర్గాలకూ బీజేపీ ఇన్‌ఛార్జీలను నియమించింది. అధికారిక ఉత్తర్వులు జారీ చేస్తూ 17మంది జాబితాను విడుదల చేసింది. 8 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ, ఎంపీతోపాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించింది. By srinivas 08 Jan 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి BJP: లోక్ సభ (Lok Sabha) ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా రాజకీయ పార్టీలు తమ ప్రచార అస్త్రాలను సిద్దం చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే అధికార పార్టీ బీజేపీ మూడోసారి గెలుపే లక్ష్యంగా ముదుకెళ్తూ రాజకీయ వ్యూహాలకు పదును పెడుతోంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం లోక్ సభ ఎన్నికల నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేస్తుండగా.. తాజాగా తెలంగాణ రాష్రంలోని అన్ని లోక్‌సభ నియోజకవర్గాలకూ బీజేపీ ఇన్‌ఛార్జీలను నియమించింది. ఈ మేరకు బీజేపీ ధిష్టానం అధికారిక ఉత్తర్వులు జారీ చేస్తూ ఇందుకు సంబంధించిన జాబితాను విడుదల చేసింది. మొత్తం 17 మందితో కూడిన జాబితాలో.. 8 మంది ఎమ్మెల్యేలు, ఒకరు ఎమ్మెల్సీ, ఒకరు ఎంపీ ఉన్నారు. అలాగే ముగ్గురు Ex ఎమ్మెల్సీలు, ఒకరు ఎక్స్ ఎంపీ ఉన్నారు. ఇద్దరు ఎక్స్ ఎమ్మెల్యేలు, ఒకరు మాజీ మంత్రిని నియమించారు. అదిలాబాద్ - ఎమ్మెల్యే పాయాల్ శంకర్ పెద్దపల్లి - రామారావు పటేల్, కరీంనగర్ - ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా, నిజామాబాద్ - ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జహీరాబాద్ - కాటిపల్లి వెంకటరమణారెడ్డి, మెదక్ - హరీష్ బాబు, మల్కాజ్‌గిరి - పైడి రాకేశ్ రెడ్డి, సికింద్రాబాద్ - డాక్టర్ కే.లక్ష్మణ్, హైదరాబాద్ - రాజాసింగ్, చేవెళ్ల - వెంకట నారాయణ రెడ్డి, మహబూబ్‌నగర్ - రామచందర్ రావు, నాగర్‌కర్నూలు - రంగారెడ్డి, నల్లగొండ - చింతల రామచంద్రా రెడ్డి, భువనగిరి - ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, వరంగల్ - మర్రి శశిధర్ రెడ్డి, మహబూబాబాద్ - గరికపాటి మోహన్ రావు, ఖమ్మం - పొంగులేటి సుధాకర్ రెడ్డి ఇది కూడా చదవండి : Golden Globes: ‘గోల్డెన్ గ్లోబ్’అవార్డ్స్’.. సంచలనం సృష్టించిన ‘ఓపెన్‌హైమర్’ ఇక పార్టీ కీలక నేతలు.. బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, డీకే అరుణ, కిషన్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డిలకు ఏ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించకపోవడం విశేషం. ఇదిలావుంటే.. ప్రధాని మోడీ తన లోక్ సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. జనవరి 13 నుంచి మోదీ ఎన్నికల ప్రచారాన్ని పారంభించనున్నట్లు తెలుస్తోంది. తొలి సభ బిహార్ నుంచే ప్రారంభం కానుందని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో 40 స్థానాలు ఉన్న బిహార్ ను తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. కాగా బిహార్ లో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలు వివిధ ప్రచార సభల్లో పాల్గొననున్నట్లు సమాచారం. జనవరి 15 తర్వాత ముమ్మర ప్రచారం చేయబోతున్నట్లు తెలుస్తోంది. #bjp #lok-sabha #list #in-charges మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి