Refrigerator Safety Tips: ఈ తప్పులు చేస్తే మీ ఫ్రిడ్జ్‌ పేలిపోతుంది..జాగ్రత్త!

ఫ్రిడ్జ్‌ను 8 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం వాడితే మంచిది కాదంటున్నారు నిపుణులు. కండెన్సర్ కాయిల్ కుంచించుకుపోవడం మొదలైతే ఫ్రిడ్జ్‌ పేలే ప్రమాదం ఉంటుంది. కంప్రెసర్ కాయిల్‌లో ఎక్కువ వాయువు పేరుకుపోతే.. ఒత్తిడి పెరిగి భారీ పేలుడుకు దారితీస్తుంది.

Summer Tips: వేసవిలో ఈ 5 తప్పులు చేస్తే ఆరోగ్యం పాడవుతుంది జాగ్రత్త!
New Update

Refrigerator Safety Tips: ప్రస్తుత కాలంలో ఫ్రిడ్జ్‌ చాలా అవసరం. సీజన్‌తో సంబంధం లేకుండా.. ఏడాదిపోడువునా.. ఉపయోగంలో ఉండే వస్తువు ఫ్రిడ్జ్‌ ఒకటి. అయితే.. ఇది ఎన్ని అవసరాలు తీరుస్తుందని తెలుసుగానీ.. దీని అవసరాలేంటో కొద్ది మందికే తెలుసు. అందుకే.. ఫ్రిడ్జ్‌ నిర్వహణకు సంబంధించిన జాగ్రత్తలన్నీ ఖచ్చితంగా తెలుసుకోని పాటించాకపోతే రిఫ్రిజిరేటర్ బాంబులా పేలి ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది. మరి ఈ సమస్యలు ఎలా వస్తాయో..అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫ్రిడ్జ్‌ ప్రమాదం రాకుండా ఉండాలంటే..

ఫ్రిడ్జ్‌​లో ప్రధానంగా పేలుడు దాని కంప్రెషర్ వల్ల వస్తుంది. ఈ కంప్రెసర్ యూనిట్ వెనుక భాగంలో ఉంటుంది. ఇది పంప్, మోటారును కలిగి ఉంటుంది. కాయిల్ ద్వారా కూలింగ్ వాయువును నెట్టేస్తుంది. ఆ వాయువే ద్రవంగా మారి.. వేడిని గ్రహించి వస్తువులను కూల్‌గా ఉంచుతుంది. కొన్ని సార్లు ఫ్రిడ్జ్‌ వెనుక భాగంలో కొన్నిసార్లు వేడెక్కుతుంది. దీంతో కండెన్సర్ కాయిల్ కుంచించుకుపోవడం మొదలైతుంది. ఫలితంగా.. కంప్రెసర్ కాయిల్‌లో ఎక్కువ వాయువు పేరుకుపోయి.. ఒత్తిడి పెరిగి భారీ పేలుడుకు దారితీస్తుంది. 8 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం వాడితే రిఫ్రిజిరేటర్లలో ఈ ప్రమాదం వస్తుంది. ఈ ప్రమాదం రాకుండా ఉండాలంటే కంప్రెసర్ కాయిల్ మూసుకోకుండా శుభ్రం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి: పిల్లలు మలబద్ధకంతో బాధపడుతున్నారా..? ఈ చిట్కాలు పాటించండి

అంతేకాకుండా.. ఎలక్ట్రికల్ వైరింగ్‌లో లోపం, ఫ్యాన్ మోటార్ లేదా కంప్రెసర్ ఫ్యాన్‌లో ప్రాబ్లమ్, పవర్ ప్లగ్, పవర్ సప్లై కార్డ్‌లో లోపం, ఫ్రీజర్ కెపాసిటర్‌లో లోపాలు రాకుండా ఫ్రిడ్జ్‌ పేలే అవకాశం ఉంది. పాజిటివ్ టెంపరేచర్ కోఎఫీషియంట్ రెసిస్టర్‌లో.. డీఫ్రాస్ట్ టైమర్‌లో.. లోపాల వల్ల కూడా పేలే అవకాశం ఉంది. అందుకే.. మీరు ఫ్రిడ్జ్‌లో ఏదైనా సమస్య వస్తే వెంటనే టెక్నిషీయన్‌కి చూపించాలి. విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు అనిపించినప్పుడు కూడా ఫ్రిడ్జ్‌ను అన్‌ప్లగ్ చేయాలి. ఫ్రిడ్జ్‌లో విద్యుత్తు హెచ్చుతగ్గులు ఉంటే కంప్రెసర్‌పై ఒత్తిడి పెరిగి ఫ్రిడ్జ్‌ పేలుతుంది. అంతేకాదు కొన్ని సందర్భాల్లో ఫ్రిడ్జ్‌లో కూలింగ్ ఎక్కువై మంచు గడ్డకట్టుకుపోతుంది. అలాంటప్పుడు ఎక్కువ సార్లు ఫ్రిడ్జ్‌ తెరవాలి. లేదంటే మంచు ఫ్రిడ్జ్‌ నిండా పేరుకుపోయి. కంప్రెషర్‌​పై భారం పడి పేలుడు జరిగే ప్రమాదం ఉంటుంది.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

#refrigerator-safety #tips
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe