Tirumala: తిరుమలకు వెళ్లాలనుకుంటే ఇప్పుడే ప్లాన్‌ చేసుకోండి

తిరుమలలో భక్తుల రద్దీ ఈరోజు సాధారణంగా ఉంది. స్వామివారి దర్శనం కోసం వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని నాలుగు కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచిఉన్నారు. ఉచిత దర్శనానికి 10 గంటల సమయం, టైమ్‌స్లాట్‌ దర్శనానికి 4 గంటలు పడుతుందని అధికారులు అంటున్నారు.

Tirumala: తిరుమలకు వెళ్లాలనుకుంటే ఇప్పుడే ప్లాన్‌ చేసుకోండి
New Update

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ ఈరోజు సాధారణంగా ఉంది. స్వామివారి దర్శనం కోసం వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని నాలుగు కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచిఉన్నారు. ఉచిత దర్శనానికి 10 గంటల సమయం, టైమ్‌స్లాట్‌ దర్శనానికి 4 గంటలు పడుతుందని అధికారులు అంటున్నారు. పరీక్షల ఫలితాలు విడుదలకావడంతో భక్తుల సంఖ్య కాస్త పెరిగిందని, అనుకున్న స్థాయిలో మాత్రం రద్దీ లేదని చెబుతున్నారు.

కంపార్ట్‌మెంట్లు అన్నీ దాదాపు ఖాళీగానే కనిపిస్తున్నారు. రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లు ఉన్నవారికి మాత్రం దర్శనానికి 3 గంటలే పడుతుందని టీటీడీ అధికారులు అంటున్నారు. నిన్న శ్రీవారిని 77,511 మంది భక్తులు దర్శించుకోగా 26,553 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం 4.28 కోట్ల రూపాయలు వచ్చినట్టు అధికారులు తెలిపారు.

శ్రీరామనవమిని సందర్భంగా రేపు శ్రీవారి ఆలయంలో ఆస్థానాన్ని నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి రంగనాయకుల మండపంలో సీతారామ, లక్ష్మణ సమేత హనుమంతులకు స్నపన తిరుమంజనానికి ఏర్పాట్లు చేశారు. సాయంత్రం హనుమంత వాహనసేవ జరగనుంది. హనుమంత వాహనంపై శ్రీరాములవారు ఊరేగుతారు.

ఇది కూడా చదవండి: పాతబస్తీలో అర్థరాత్రి కత్తులతో వీరంగం.. యువకుడి దారుణ హత్య

#tirumala
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe