Bank Jobs: నిరుద్యోగులకు గుడ్ ఛాన్స్.. డిగ్రీ అర్హతతో బ్యాంక్‌లో జాబ్స్! ఇలా అప్లై చేయండి! అప్రెంటిస్ పోస్టుల కోసం ఇండియన్ బ్యాంక్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను నిర్వహిస్తోంది. మొత్తం 1500 పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. జూలై 31 వరకు అప్లై చేసుకోవచ్చు. జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి దరఖాస్తు ఫీజ్ రూ. 500. అభ్యర్థి వయస్సు పరిమితి 20 -28 సంవత్సరాలు. By Trinath 14 Jul 2024 in జాబ్స్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి బ్యాంకింగ్ రంగంలో కెరీర్ స్టార్ట్ చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. ఇండియన్ బ్యాంక్ అప్రెంటిస్ పోస్టుల రిక్రూట్‌మెంట్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. అర్హత ఉన్న అభ్యర్థులు ఇండియన్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ (indianbank.in.) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కింద, సంస్థలో 1,500 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తారు. నమోదు ప్రక్రియ జూలై 31, 2024న ముగుస్తుంది. అర్హతలేంటి? : ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. అభ్యర్థులు తప్పనిసరిగా 31.03.2020 తర్వాత బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసి ఉత్తీర్ణత సర్టిఫికేట్ కలిగి ఉండాలి. అభ్యర్థి వయస్సు పరిమితి 20 -28 సంవత్సరాల మధ్య ఉండాలి. అటు భారత ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం SC/ST/OBC/PWBD మొదలైన కేటగిరీలకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. ప్రతీకాత్మక చిత్రం ఎంపిక ప్రక్రియ: ట్రైనీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆన్‌లైన్ రాత పరీక్ష ఉంటుంది. తర్వాత స్థానిక భాషా నైపుణ్యాలపై పరీక్ష ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్ మినహా ప్రధాన ప్రాంతీయ భాషలలో పరీక్ష నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ టైప్‌లో ఎగ్జామ్ ఉంటుంది. పరీక్షలో రాంగ్ ఆన్సర్స్‌కు నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతీ రాంగ్ ఆన్సర్‌కు నాలుగో వంతు మార్కులకు కోత విధిస్తారు. పరీక్ష కోసం కాల్ లెటర్‌లు అభ్యర్థులకు ఇమెయిల్ ద్వారా లేదా బ్యాంక్ వెబ్‌సైట్ లేదా apprenticeshipindia.org ద్వారా పంపుతారు. లేదా nsdcindia.org/apprenticeship లేదా bfsissc.com ద్వారా విడుదల చేస్తారు. దరఖాస్తు ఫీజ్: జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి దరఖాస్తు రుసుము రూ. 500. SC/ST/PWBD కేటగిరీ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. దరఖాస్తు రుసుము/ఇంటిమేషన్ ఫీజు ఆన్‌లైన్ చెల్లింపు కోసం అభ్యర్థి బ్యాంక్ లావాదేవీల ఛార్జీలను భరించాలి. ఫీజులను ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి. Also Read: వారికి గుడ్ న్యూస్.. మరో పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్ #bank-jobs #indian-bank మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి