యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) జాయింట్ జియో సైంటిస్ట్ రిక్రూట్మెంట్ ద్వారా అనేక పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ (Preliminary Examination) పరీక్ష కోసం రిజిస్ట్రేషన్ విండో అధికారిక వెబ్సైట్లో ఉంచనున్నారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ upsc.gov.inని సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం, ఈ రిక్రూట్మెంట్ పరీక్షకు దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ అక్టోబరు 10. అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ అక్టోబర్ 10 సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే దరఖాస్తు చేసుకోగలరు.
ఖాళీల వివరాలు:
ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ ద్వారా మొత్తం 56 ఖాళీ పోస్టులను భర్తీ చేస్తారు.
-జియాలజిస్ట్, గ్రూప్ A - 34 పోస్టులు
-జియోఫిజిసిస్ట్, గ్రూప్ A- 1 పోస్ట్
-కెమిస్ట్, గ్రూప్ A - 13 పోస్టులు
-సైంటిస్ట్ B (హైడ్రోజియాలజీ), గ్రూప్ A - 4 పోస్టులు
-సైంటిస్ట్ B(కెమికల్), గ్రూప్ A- 2 పోస్టులు
-సైంటిస్ట్ బి (జియోఫిజిసిస్ట్), గ్రూప్ ఎ - 2 పోస్టులు
ఇది కూడా చదవండి: కుక్కకు నక్క సాక్ష్యం…కెనడాకు పాక్ వత్తాసు..!!
అర్హతలు:
UPSC జియో సైంటిస్ట్ రిక్రూట్మెంట్ 2024 పరీక్షకు దరఖాస్తు చేయడానికి, అభ్యర్థి తప్పనిసరిగా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సంబంధిత సబ్జెక్ట్‌లో మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉండాలి. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌ను చెక్ చేసుకోవచ్చు.
ఎంపిక ప్రక్రియ:
అభ్యర్థులు ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ రౌండ్లలో వారి పనితీరు ఆధారంగా సెలక్ట్ అవుతారు. ఫిబ్రవరి 18న జరిగే ప్రిలిమ్స్ రౌండ్లో అర్హత సాధించిన వారిని నెక్ట్స్ రౌండ్ కు పిలుస్తారు.
ఎలా దరఖాస్తు చేయాలి :
-ముందుగా అధికారిక వెబ్సైట్- upsc.gov.inకి వెళ్లండి.
- కంబైన్డ్ జియో-సైంటిస్ట్ ఎగ్జామినేషన్ 2024 లింక్‌పై క్లిక్ చేయండి.
-upsconline.nic.inకు వెళ్లిన తర్వాత కొత్త రిజిస్ట్రేషన్‌పై క్లిక్ చేయండి.
-ఆ తర్వాత పేరు, పుట్టిన తేదీ, ఇమెయిల్ అడ్రెస్ వంటి వివరాలను నమోదు చేయండి.
-నమోదు చేసుకున్న తర్వాత, మీ ఇమెయిల్ ID పాస్వర్డ్ ఉపయోగించి లాగిన్ చేయండి.
- దరఖాస్తు ఫారమ్‌ను నింపండి. అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయండి.
-ఇప్పుడు సేవ్ చేయండి సబ్మిట్ చేయండి.
-చివరిగా భవిష్యత్తు అవసరాల కోసం దరఖాస్తు ఫారమ్‌ను డౌన్లోడ్ చేసుకోండి.
ఇది కూడా చదవండి: నేడు ఓంకారేశ్వర్‌లో ఆదిశంకరాచార్యుల విగ్రహావిష్కరణ..!!
పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారు:
పరీక్ష మూడు భాగాలుగా నిర్వహిస్తారు - ప్రిలిమినరీ, మెయిన్, పర్సనాలిటీ టెస్ట్. ప్రిలిమినరీ పరీక్ష ఫిబ్రవరి 18, 2024న నిర్వహిస్తారు. ప్రధాన పరీక్ష జూన్ 22, 2024న నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.