Hero Dhanush: హీరో ధనుష్, ఐశ్వర్య విడాకులకు కారణం ఇదే.. షాకింగ్ నిజాలు..!

స్టార్ హీరో ధనుష్ భార్య ఐశ్వర్య అధికారికంగా విడాకులకు అప్లై చేసిన సంగతి తెలిసిందే. అసలు ధనుష్‌, ఐశ్వర్య ప్రేమ కథ ఎలా మొదలైంది.. ఇది విడాకులకు ఎలా దారి తీసిందో తెలుసుకోవడానికి ఈ హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.

New Update
Hero Dhanush: హీరో ధనుష్, ఐశ్వర్య  విడాకులకు కారణం ఇదే.. షాకింగ్ నిజాలు..!

Hero Dhanush: డివోర్స్‌ సాధారణమైపోయిన రోజులివి. సినీ సెలబ్రిటీలు నుంచి సామాన్యుల వరకు డివోర్స్‌ తీసుకునే కపుల్స్‌ సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రేమ కథలు డివోర్స్‌ కథలుగా మారడం సర్వసాధరణంగా మారిపోయాయి. ఈ లిస్ట్‌లోకి ధనుష్‌, ఐశ్వర్య కూడా ఎప్పుడో వచ్చి చేరినా తాజాగా అధికారికంగా విడాకులకు అప్లై చేసి వార్తల్లో నిలిచారు. అసలు ధనుష్‌, ఐశ్వర్య ప్రేమ కథ ఎలా మొదలైంది.. ఇది విడాకులకు ఎలా దారి తీసిందో ఇవాళ చెప్పుకుందాం!

ధనుష్, ఐశ్వర్య 2004లో వివాహం చేసుకున్నారు. ధనుష్ కు పెళ్లి జరిగినప్పుడు అతని వయసు 23 ఏళ్లు. తనకంటే వయసులో పెద్దదైన మహిళను పెళ్లి చేసుకున్నాడంటూ ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ వీరిద్దరూ బెస్ట్ కపుల్‌గా కనిపించారు. ఇద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండకుండా వివాహ జీవితంలో ముందుకు వెళ్లారు ఒకరిపై ఒకరికి పరస్పర అవగాహన, ప్రేమ ఉండేవి. 20-30 ఏళ్ల వయసు వచ్చేసరికి మన మనసుకు ఏది బాగా నచ్చుతుందో అదే మనకు నచ్చుతుంది. నా దృష్టిలో అది నా భార్య, కుటుంబమని చెప్పేవాడు ధనుష్‌.

తన పనిలో ఎంత స్వేచ్ఛగా ఆలోచించేవాడో స్వతంత్రంగా వ్యవహరించడానికి భార్యకు అంతే స్వేచ్ఛనిచ్చాడు. వివాహానంతరం ఐశ్వర్య తమిళ చిత్ర నిర్మాణం, భరతనాట్యం, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇలా అనేక రంగాల్లో రాణించింది. అల్లుడిని కొడుకులా పిలవడం మామగారింట్లో జరిగే పని కాదు. కానీ అది రజనీ ఇంట్లో సాధ్యమైంది. ఇద్దరు కూతుళ్లకు తండ్రి అయిన రజినీకాంత్ ధనుష్ ను సొంత కొడుకులా భావించేవారు. ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో చెప్పారు.

ధనుష్, ఐశ్వర్య దంపతులకు ఇద్దరు పిల్లలు. వీళ్ల పిల్లలు ఇప్పుడు విదేశాల్లో చదువుతున్నారు. ఐతే ఇప్పుడు ఈ జంట అధికారికంగా విడిపోతున్న విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. త‌మ‌కు విడాకులు మంజూరు చేయాలంటూ చెన్నై కోర్టులో ధ‌నుష్‌, ఐశ్వ‌ర్య జంట పిటిష‌న్ దాఖ‌లు చేసింది. ఉమ్మ‌డి అంగీకారంతో ఈ జంట విడిపోవ‌డానికి సిద్ధ‌మైంది.

Also Read: Nithya Menon: గుండెజారి గల్లంతయ్యిందే.. హ్యాపీ బర్త్ డే కర్లీ బ్యూటీ.. ‘డియర్ ఎక్సెస్’ తో వచ్చేస్తున్న నిత్యా..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు