ఎప్పుడైనా కళ్లు తిరిగి పడిపోయారా ? కారణం ఇదే

ఒక్కోసారి కొంతమంది హఠాత్తుగా కళ్లు తిరిగి పడిపోతుంటారు. ఇలా జరిగిన తర్వాత ఏం జరిగింది, ఎందుకు పడిపోయారో అనే విషయాలు అర్థం కావు. అయితే ఇలా కళ్లు తిరిగి పడిపోవడం వెనక ఉన్న కారణాన్ని అమెరికాలోని కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు గుర్తించారు.

ఎప్పుడైనా కళ్లు తిరిగి పడిపోయారా ? కారణం ఇదే
New Update

కొంతమంది ఒక్కోసారి కళ్లు తిరిగి పడిపోవడం చూస్తుంటాం. ఒకటి రెండు నిమిషాలు పాటు మాత్రమే కళ్లు తిరిగి పడిపోయినప్పటికీ ఆ తర్వాత గందరగోళం అలుముకుంటుంది. మనలో దాదాపు 40 శాతం మందికి జీవితంలో ఎప్పుడో ఓసారి కళ్లు తిరిగి పడిపోతారని పరిశోధకులు తెబుతున్నారు. వాస్తవానికి ఇలా కళ్లు తిరిగిపడిపోయిన తర్వాత ఏం జరిగింది, ఎందుకు పడిపోయామో అనే విషయాలు అర్థం కావు. మరో విషయం ఏంటంటే శరీరం లోపల ఏం జరిగితే పడిపోతామో ఇప్పటివరకు శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేకపోయారు. కానీ తాజాగా అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ సైంటిస్టులు ఇలా ఎందుకు జరుగుతుందో గుర్తించారు. కొన్నిరకాల ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఇలా కళ్లు తిరిగిపడిపోవడం జరుగుతూ ఉంటుంది. అందుకే శాస్త్రవేత్తలు ఈ సమస్యను పరిష్కారం చూపించగలుగుతారని అంచనా.

కళ్లుతిరిగి పడిపోవడాన్ని వైద్య పరిభాషలో సింకోప్ అని అంటారు. అయితే సింకోప్‌కు చెందిన సంకేతాలు గుండె, మెదళ్ల మధ్య ప్రయాణించేందుకు కారణమైన జన్యువుల గురించి తెలిసింది. సింకిప్‌కు మెదడు గుండెకు పంపే సంకేతం కారణం అని భావించేవాళ్లు. మెదడు ఆదేశాల మేరకు గుండె పనిచేసి కళ్లు తిరిగి పడిపోయేలా చేస్తుందని ఇప్పటిదాకా ఓ అంచనా ఉండేది. కానీ వినీత్ ఆగస్టీన్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం దీనిపై పరిశోధనలు చేయగా.. ఇందులో సగం మాత్రమే నిజమని తెలిసింది. సింకోప్‌కు ముందు గుండె కూడా మెదడుకు సంకేతం పంపిస్తుందని.. ఇది మెదడు పనితీరును మార్చేస్తోందని తెలిసింది. అలాగే సింకోప్‌ సమయంలో గుండె తక్కువ వేగంతో కొట్టుకుంటుందని.. అలాగే రక్తపోటు, ఊపిరి వేగం కూడా తక్కువగా ఉంటాయని 1867లో బెజోల్డ్ జారిష్ రిఫ్లెక్స్ అనే సిద్ధాంతం చెప్పింది. కానీ ఇది ఇంకా రుజువు కాలేదు.

కాలిఫోర్నియా వర్శిటీ శాస్త్రవేత్తలు మెదడు నుంచి శరీరానికి సంకేతాలు పంపేటటువంటి కీలకమైన వాగస్‌ నాడిపై పరిశోధనలు చేశారు. ఈ వాగల్‌ సెన్సిరీ న్యూరాన్లు మెదడు స్టెమ్‌ (కాండ భాగం)కు సంకేతాలు పంపుతుందని, బీజేఆర్‌ లక్షణాలకు, సింకోప్‌కు దీనికి సంబంధం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ వాగల్‌ సెన్సిరీ న్యూరాన్లు విడుదల చేసే రెండు రకాల పెప్టైడ్లను అందించినప్పుడు ఎలుకలు వెంటనే మూర్ఛపోయాయి. ఆ తర్వాత పరిశీలనల్లో ఎన్‌పీవై2ఆర్‌ అనే పెప్టైడ్‌ సింకోప్‌లో ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ ఫలితాలతో సింకోప్‌ను అరికట్టడానికి కొత్త మందులు తయారు చేయవచ్చని.. అలాగే పలు మానసిక, నాడీ సంబంధిత సమస్యలకు పరిష్కారాలు కూడా కనుక్కోవచ్చని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త తెలిపారు.

#telugu-news #health #faint
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe