Realme Narzo: రియల్ మీ ఫోన్ పై భారీ తగ్గింపు.. రూ. 10 వేల లోపే!

కొత్తగా రిలీజ్‌ అయిన రియల్ మీ నార్జో 60 ఎక్స్‌ స్మార్ట్‌ ఫోన్‌ ను పై మంచి ఆఫర్స్‌ ని అందిస్తుంది.రూ. 11,749 కే సొంతం చేసుకునే అవకాశాన్ని ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌ కల్పిస్తుంది.

New Update
SmartPhone:  ఈ పవర్ ఫుల్ ఫోన్‎పై..ఏకంగా రూ. 4000 డిస్కౌంట్..పూర్తివివరాలివే.!

Realme narzo 60x 5G: రియల్ మీ(Realme) మొబైల్‌ కంపెనీ ఎప్పటికప్పుడు వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అదిరిపోయే ఫీచర్స్ తో కొత్త మొబైల్‌ ను మార్కెట్‌ లోకి తీసుకుని వచ్చేసింది. కొత్తగా రిలీజ్‌ అయిన రియల్ మీ నార్జో 60 ఎక్స్‌ (Realme narzo 60x 5G) స్మార్ట్‌ ఫోన్‌ ను పై మంచి ఆఫర్స్‌ ని అందిస్తుంది.

కొత్తగా విడుదలైన ఈ ఫోన్ ధర రూ. 14,999 గా ఉండగా..అదిరిపోయే ఆఫర్ అంటే 22 శాతం డిస్కౌంట్‌ లో భాగంగా రూ. 11,749 కే సొంతం చేసుకునే అవకాశాన్ని ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌ (Amazon) కల్పిస్తుంది.

publive-image

వీటితో పాటు కొన్ని ఎంపిక చేసిన బ్యాంకు కార్డులతో కొనుగోలు చేసే వారికి అదనంగా రూ.1000 వరకు డిస్కౌంట్‌ పొందొచ్చు. దీంతో 15 వేల ఫోన్‌ ని రూ. 10 వేలకే సొంతం చేసుకోవచ్చు. ఇందులో ఉన్న ఫీచర్లు గురించి చెప్పుకుంటే..5 జీ నెట్‌ వర్క్‌ కి కూడా వర్క్‌ చేస్తుంది. ఈ ఫోన్‌ లో 4 జీబీ ర్యామ్‌ తో పాటు 128 జీబీ స్టోరేజ్‌ కూడా ఉంది.

ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్ సిస్టమ్ తో ఈ ఫోన్‌ పని చేస్తుంది. బ్యాటరీ పవర్‌ 5000 ఎమ్‌ఏహెచ్‌ గా ఉంది. చాలా తక్కువ టైమ్‌ లోనే ఫోన్‌ స్పీడ్‌ గా ఛార్జ్‌ అవుతుంది. సెల్ఫీ ప్రియులకు ఈ ఫోన్‌ తో పండుగే..ఇందులో 50 మెగా పిక్సెల్‌ తో రెయిర్ కెమెరా కూడా ఇందులో ఉంది.

publive-image

కనెక్టివిటీ ఫీచర్‌ విషయానికి వస్తే ఇందులో బ్లూటూత్‌, సెల్యూలర్‌, వైఫై, ట్రూ జీపీఎస్ వంటి ఫీచర్స్ ఈ ఫోన్‌ లో అందుబాటులో ఉంటాయి.ఇకపోతే ఈ ఫోన్‌లో 6.72 ఇంచెస్‌తో కూడిన ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. 90 హెచ్‌జెడ్‌ ఈ స్క్రీన్‌ సొంతం. ఈ ఫోన్‌లో పంచ్‌ హోల్‌ డిస్‌ప్లేను ఇచ్చారు.. ఈ ఫోన్ కు మార్కెట్ లో మంచి డిమాండ్ కూడా ఉంది.

Also read: లావణ్య పెళ్లి చీర మీద ఏం రాసి ఉందో చూశారా..వరుణ్‌ అంటే అంత ఇష్టమా?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు