Anakapalli: ఒక్క ఘటన..మూడు జిల్లాలు..మాటలకందని విషాదం!

అచ్యుతాపురం సెజ్‌ లో రియాక్టర్ పేలి చనిపోయిన 18 మందిలో నలుగురు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వారు ఉన్నారు. కాకినాడకు చెందిన హారిక, సామర్లకోటకు చెందిన నాగబాబు, బిక్కవోలు వాసి గణేష్‌ కుమార్‌, మామిడికుదురుకు చెందిన సతీష్‌ ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.

Anakapalli: ఒక్క ఘటన..మూడు జిల్లాలు..మాటలకందని విషాదం!
New Update

Anakapalli: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌ లో రియాక్టర్ పేలడంతో 18 మంది మృతి చెందగా..50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన వారిలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వారే నలుగురు ఉన్నారు. వారిలో కాకినాడకు చెందిన హారిక ఒకరు. ఆమె ఇడుపాలపాయ ట్రిపుల్‌ ఐటీలో కెమికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసి 11 నెలల క్రితం ఉద్యోగంలో చేరింది.

రెండు రోజుల క్రితం తన సోదరులకు రాఖీ కట్టేందుకు సొంతూరు వెళ్లిన హారిక..బుధవారం కూడా సెలవు పెట్టడానికి ప్రయత్నించింది సెలవు దొరకకపోవడంతో..మంగళవారమే ఇంటి నుంచి బయల్దేరి వచ్చేసింది. బుధవారం జరిగిన ఈ ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

సామర్లకోటకు చెందిన నాగబాబు ఇక్కడ ప్రొడక్షన్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ గా చేస్తున్నారు. మూడు సంవత్సరాల క్రితం ఇతను ఉద్యోగంలో చేరాడు. అప్పటి నుంచి కూడా అచ్యుతాపురంలోనే ఉంటున్నాడు. త్వరలోనే ఇంటికి వస్తానని చెప్పిన నాగబాబు..ఇలా చనిపోవడంతో కుటుంబ సభ్యుల కన్నీటి రోదనలు ఆకాశాన్నంటుతున్నాయి.

బిక్కవోలు వాసి గణేష్‌ కుమార్‌ ప్రొడక్షన్‌ విభాగంలో సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ గా చేస్తున్నారు. గణేష్‌ చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇక మామిడికుదురుకు చెందిన సతీష్‌ సెజ్‌ కంపెనీలో ప్రొడక్షన్‌ విభాగంలో సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ గా పని చేస్తున్నారు. సతీష్‌ ఈ ఉద్యోగంలో ఐదు సంవత్సరాల క్రితం చేరగా..మూడేళ్ల కిందట వివాహం చేసుకున్నారు. ఇంతలోనే ఇలా అనంత లోకాలకు వెళ్లిపోవడంతో బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Also Read: పార్టీ జెండాను ఆవిష్కరించిన తమిళ నటుడు విజయ్!

#anakapalli #sez #reactor #achyuthapuram
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe