/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/polling-2-jpg.webp)
Re-Poliing in two Constituency: పశ్చిమ బెంగాల్‌లోని మధురాపూర్, బరాసత్‌లలో జూన్ 1న లోక్‌సభ ఎన్నికల కోసం పోలింగ్ జరిగింది. కానీ దీని మీద ఫిర్యాదులు రావడంతో ఇక్కడ రీ పోలింగ్ నిర్వహించాలని ఈసీ నిర్ణయం తీసుకుంది. ఈరోజు ఉదయం 7గంటలకు ప్రారంభమైన రీ పోలింగ్ సాయంత్రం ఆరు గంటలకు ముగియనుంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బరాసత్ పార్లమెంటరీ నియోజకవర్గంలోని 120-దేగంగా అసెంబ్లీ నియోజకవర్గంలోని 61 కదంబగచ్చి సరదార్ పద ఎఫ్‌పీ స్కూల్‌లోని రూమ్ నంబర్ 2, మధురాపూర్ పార్లమెంటరీ నియోజకవర్గంలోని కాక్‌ద్వీప అసెంబ్లీలో ఉన్న ఆదిర్ మహల్ శ్రీచైతన్య బిద్యాపీఠ్ ఎఫ్‌పీ స్కూల్‌లో రీపోలింగ్ నిర్వహిస్తున్నారు.
ఆ రెండు పార్లమెంటరీ నియోజకవర్గాల ఎన్నికల అధికారుల నుంచి నివేదికలు అందుకున్నాకనే రీ పోలింగ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని ఎన్నికల సంఘం చెప్పింది. దాంతో పాటూ అన్ని పరిస్థితులను అంచనా వేశామని తెలిపింది. జూన్ 1న లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌లో మధురాపూర్, బరాసత్‌లలో తృణమూల్ కాంగ్రెస్ , ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ , బీజేపీ మద్దతుదారుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. అంతకు ముందు రాష్ట్రంలో కూడా పలు చోట్ల ఇలానే గొడవలు జరిగాయి. అయితే ఎక్కడా రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం రాలేదు. కానీ ఈ రెండు నియోజకవర్గాల్లో జరిగిన ఘర్షణల్లో మాత్రం చాలా మంది గాయపడ్డారు. దీంతో అక్కడ స్థానిక మహిళలు నిరసన కూడా వ్యక్తం చేశారు. దాంతో పాటూ పోలింగ్ కూడా సవ్యంగా సాగలేదు.
Also Read:Crusie Functions: అనంత్ అంబానీ పెళ్ళి తరువాత క్రూజ్ వేడుకలకు డిమాండ్