RCB Fans vs CSK Fans: ఆర్సీబీ అభిమానుల అతి.. చెన్నై ఫాన్స్ కు అవమానం.. ఉత్కంఠగా సాగిన ఐపీఎల్ 2024 చివరి లీగ్ మ్యాచ్ లో ఆర్సీబీ విజయం సాధించి ప్లే ఆఫ్స్ చేరింది. అయితే, బెంగళూరు అభిమానులు మ్యాచ్ చూడటానికి వచ్చిన చెన్నైఅభిమానులను వేధించడం ఇప్పుడు కలకలం రేపుతోంది. చెన్నై జెర్సీ వేసుకున్నవారే టార్గెట్ గా ఆర్సీబీ అభిమానులు రెచ్చిపోయారు. By KVD Varma 19 May 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి RCB Fans vs CSK Fans: ఐపీఎల్ 2024 చివరి లీగ్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా ముగిసింది. చెన్నై టీమ్ పై బెంగళూరు జట్టు విజయాన్ని సాధించి ప్లే ఆఫ్స్ చేరింది. అసలు పోటీలో నిలుస్తుందా అనుకున్న స్థితి నుంచి ప్లే ఆఫ్స్ కి చేరడం.. అదీ చెన్నై జట్టుపై విజయం సాధించి చేరుకోవడంతో ఆర్సీబీ అభిమానుల ఆనందానికి అంతులేకుండా పోయింది. నిజానికి ఈ మ్యాచ్ ప్రారంభం వరకూ కూడా ఎవరికీ ఆర్సీబీ పై పెద్దగా అంచనాలు లేవు. బెంగళూరు అభిమానులు మాత్రం చాలా నమ్మకంగా ఉన్నారు. అంతేకాకుండా కచ్చితంగా తమ టీమ్ గెలుస్తుంది అంటూ మ్యాచ్ జరుగుతున్న బెంగళూరు చిన్నస్వామి స్టేడియం దగ్గర హంగామా సృష్టించారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు నుంచే.. ఆర్సీబీ అభిమానులు రెచ్చిపోవడం మొదలు పెట్టారు. RCB Fans vs CSK Fans: చెన్నై టీమ్ అభిమానులను హేళన చేస్తూ వీరంగం సృష్టించారు. చెన్నైని అభిమానించే వారు ఆ టీమ్ జెర్సీలు ధరించి స్టేడియంకు చేరుకున్నారు. అయితే, చెన్నై జెర్సీలతో ఉన్న అభిమానులే టార్గెట్ గా ఆర్సీబీ అభిమానులు రెచ్చిపోయారు. వాళ్ళను ఆట పట్టిస్తూ.. హేళన చేస్తూ ఇబ్బందులకు గురిచేశారు. ఇక అమ్మాయిలను అసభ్యంగా తాకడం.. హేళన చేయడం.. వారిని వేధించడం చేశారు. చెన్నై జెర్సీ వేసుకోవడమే నేరం అన్నట్టుగా, బెంగళూరు అభిమానులు ప్రవర్తించడం క్రికెట్ అభిమానులకు షాక్ ఇచ్చింది. ఆర్సీబీ గెలిచిన తరువాత మరింతగా అభిమానులు రెచ్చిపోయారు. Also Read: ఐపీఎల్ లో ప్లేఆఫ్స్ ఎవరు ఎవరితో ఆడతారు? షెడ్యూల్ ఇదిగో.. RCB Fans vs CSK Fans: తమను అసభ్యంగా వేధిస్తున్నారంటూ కొంతమంది చెన్నై అభిమానులు వరుసగా ట్వీట్స్ చేయడం కలకలం రేపింది. “తాగి వచ్చిన పురుషులు బెంగళూరు అభిమానులను వేధించారు. అలాగే, రోడ్డుపై రాష్ గ డ్రైవ్ చేస్తూ భయభ్రాంతులకు గురిచేశారు.” అంటూ అన్నే స్టీవ్ అనే మహిళ ట్వీట్ చేసింది. అలాగే, “స్టేడియం బయట ఆర్సీబీ అభిమానుల అల్లరి భరించరానిదిగా ఉంది. నేను వెళుతుంటే, నా మొహంపై చేతులు పెట్టి ఊపుతూ భయపెట్టారు. చెన్నై అభిమానులూ.. జాగ్రత్తగా ఇంటికి చేరుకోండి.” అంటూ మాన్య అనే అమ్మాయి ట్వీట్ చేసింది. RCB Fans vs CSK Fans: “అన్నిటికంటే ముఖ్యంగా, బెంగళూరు అభిమానులు మనుషుల్లా ప్రవర్తించడం లేదు. వాళ్ళు ఎవరినీ వదల్లేదు. మగవాళ్ళు.. ఆడవాళ్లు అని కూడా చూడలేదు. పిల్లలను కూడా వదలకుండా వేధించారు. చెన్నై జెర్సీ వేసుకున్నవాళ్ళు కనిపిస్తే.. వారి మీదకు క్రాకర్స్ విసిరి అల్లరి చేసి ఆనందించారు. వాళ్లంతా బాగా తాగి ఉన్నారు.” అంటూ ఒకాయన ట్వీట్ చేశాడు. ఇంకో యువతి “మేము ఇద్దరం ఉన్నాం. చెన్నై జెర్సీ వేసుకున్నందుకు ఆర్సీబీ అభిమానులు దారుణంగా అల్లరి చేశారు. మామీద అరుస్తూ మీది.. మీదికి వచ్చారు. మేము క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వేగంగా చేరిపోయాం.” అని పోస్ట్ చేసింది. RCB Fans vs CSK Fans: ఇలా ఆర్సీబీ అభిమానులు బెంగళూరు పరువును తీసేశారు. అభిమానం ఉండడం వేరు.. దురభిమానం వేరు అనేది అభిమానులు తెలుసుకోవాలి. తమ జట్టు గలిస్తే సంబరాలు చేసుకుంటే.. ఓటమి పాలైన టీమ్ అభిమానులు కూడా సరదా పడేలా ఉండాలి. అంతేకానీ, ఇలా అసభ్య చేష్టలు.. అర్ధం కాని అల్లరి చేయడం చాలా తప్పు అంటూ క్రికెట్ అభిమానులు అంటున్నారు. ఆఖరికి చెన్నై సూపర్ కింగ్స్ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి చెన్నై అభిమానులను జాగ్రత్తగా ఇళ్లకు చేరుకోవాలని కోరుకుంటున్నాము అంటూ ట్వీట్ చేసేలా పరిస్థితి వచ్చింది అంటే.. బెంగళూరు అభిమానులు చేసిన అల్లరి ఎలా ఉండి ఉంటుందో ఊహించుకోవచ్చు.. సీఎస్కె చేసిన ట్వీట్ ఇదే.. To our fans who came and supported us today at Bangalore. Hope you reached home safe!💛 Forever grateful for your love and support! 🫂💛#YelloveForever — Chennai Super Kings (@ChennaiIPL) May 18, 2024 #rcb-vs-csk #rcb-fans మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి