RBI: సెప్టెంబర్ 30 తర్వాత రూ.2000 నోటు చెల్లుబాటవుతుందా? కీలక సమాచారం మీకోసం.. RBI రూ. 2,000 నోట్లను డిపాజిట్ చేయడానికి/లేదా మార్చుకోవడానికి సెప్టెంబర్ 30, 2023 వరకు అంటే ఈ శనివారం వరకు మాత్రమే సమయం ఇచ్చింది. మీ వద్ద ఇంకా రూ.2,000 నోట్లు ఉండి, వాటిని ఇంకా డిపాజిట్ చేయకున్నా లేదా మార్చుకోకుంటే, ఈ గడువులోగా వెంటనే మార్చుకోండి. By Shiva.K 29 Sep 2023 in బిజినెస్ నేషనల్ New Update షేర్ చేయండి Reserve Bank of India: RBI రూ. 2,000 నోట్లను డిపాజిట్ చేయడానికి/లేదా మార్చుకోవడానికి సెప్టెంబర్ 30, 2023 వరకు అంటే ఈ శనివారం వరకు మాత్రమే సమయం ఇచ్చింది. మీ వద్ద ఇంకా రూ.2,000 నోట్లు ఉండి, వాటిని ఇంకా డిపాజిట్ చేయకున్నా లేదా మార్చుకోకుంటే, ఈ గడువులోగా వెంటనే మార్చుకోండి. సెప్టెంబరు 30, 2023 తర్వాత రూ.2,000 నోట్ల పరిస్థితి ఏంటనే దానిపై ఆర్‌బిఐ నుంచి ఎలాంటి స్పష్టత లేదు. ముఖ్యంగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) 2000 రూపాయల నోటు చట్టబద్ధమైన టెండర్ హోదాను ఉపసంహరించుకోలేదు. అంటే గడువు ముగిసిన తర్వాత కూడా రూ.2000 నోటు చట్టబద్ధమైన కరెన్సీగానే ఉంటుంది. రూ. 2000 నోటును ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన తర్వాత ఆర్బీఐ గవర్నర్ మీడియా సమావేశంలో కొన్ని కిలీక పాయింట్స్ చేశారు. ఆ ప్రకారం.. సెప్టెంబరు 30 తర్వాత ఏం జరుగుతుందనే దానిపై ఓసారి వివరంగా తెలుసుకుందాం. సెప్టెంబర్ 30 వరకు రూ.2000 నోటు చలామణిలో ఉంటుందని మాత్రమే ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. ఆ తరువాత ఈ పెద్ద నోటు 'చట్టబద్ధమైన కరెన్సీ'గానే ఉంటుంది. సెప్టెంబర్ 30 గడువు పొడిగిస్తారా? సెప్టెంబర్ 1, 2023న RBI పత్రికా ప్రకటన ప్రకారం, చెలామణిలో ఉన్న రూ. 2000 నోట్లలో 93 శాతం మే 19, 2023 నాటికి తిరిగి వచ్చాయి. చాలా నోట్లు బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి వచ్చాయి. కాబట్టి 2000 రూపాయల నోట్లను డిపాజిట్ చేయడానికి, మార్చడానికి గడువును పొడిగించే అవకాశం చాలా తక్కువ. 30 సెప్టెంబర్ 2023 తర్వాత ఏంటి పరిస్థితి? సెప్టెంబర్ 30వ తేదీ తరువాత రూ. 2000 నోటు చట్టబద్ధమైన టెండర్ స్థితిలో కొనసాగుతుంది. అయితే, గడువు ముగిసినా ఇంకా ఎవరైనా రూ.2000 నోటు కలిగి ఉంటే వారి పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న. ఈ నోట్ల ద్రవ్య విలువను రీడీమ్ చేయడానికి ఆర్‌బిఐ క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఆర్థిన నిపుణుల విశ్లేషణ ప్రకారం సెప్టెంబరు 30 తర్వాత పరిస్థితి ఇలా ఉండొచ్చు. లావాదేవీ లేకపోయినా డిపాజిట్ పర్మిషన్ ఇవ్వొచ్చు.. సెప్టెంబరు 30 తర్వాత రూ.2000 నోటును లావాదేవీలకు ఉపయోగించకపోయినా.. బ్యాంకుల్లో డిపాజిట్లు చేసేందుకు ఆర్బీఐ అనుమతి ఇవ్వవచ్చు అని భావిస్తున్నారు. రూ.2000 నోట్లకు సంబంధించి ఆర్బీఐ ఉత్తర్వులు ఇచ్చినప్పటి నుంచి చాలా మంది దుకాణదారులు, వ్యాపారులు రూ.2000 నోట్లను స్వీకరించేందుకు నిరాకరించారు. ఆర్‌బీఐ తన 'క్లీన్ నోట్ పాలసీ' కింద రూ.2000 నోటును ఉపసంహరించుకుంది. 2005కి ముందు జారీ చేసిన నోట్లను చెలామణి నుంచి తొలగించేందుకు 2013-14లోనూ ఇదే తరహాలో కసరత్తు చేశారు. RBI వెబ్‌సైట్‌లో తరచుగా అడిగే ప్రశ్నల ప్రకారం, నోట్లు చట్టబద్ధమైన కరెన్సీగా ఉంటాయి. వ్యక్తులు వాటిని నిర్దిష్ట RBI కార్యాలయాల్లో మార్చుకోవచ్చు. వాటిని వారి బ్యాంక్ ఖాతాలలో జమ చేసుకోవచ్చు. ఇక్కడ మాత్రమే.. 2000 రూపాయల నోట్లను మార్చుకోవడానికి RBI తన నిర్దేశిత కార్యాలయాలలో మాత్రమే అనుమతిస్తుంది. ఇందుకు సదరు వ్యక్తుల ID, చిరునామా తప్పనిసరిగా అవసరం ఉంటుంది. 2000 రూపాయల నోట్లను చలామణి నుండి ఉపసంహరించుకున్న ఆర్‌బిఐ.. సెప్టెంబర్ 30 వరకు ఏదైనా బ్యాంకు నుండి ఒకేసారి 20,000 రూపాయల పరిమితితో 2000 రూపాయల నోట్లను మార్చుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఆర్‌బిఐకి చెందిన 19 ప్రాంతీయ కార్యాలయాల్లో కూడా మార్పిడి సౌకర్యం కల్పించింది. కొన్ని బ్యాంకులు 2000 రూపాయల నోట్లను మార్చుకోవడానికి ఐడి ప్రూఫ్ ఏమీ అడగడం లేదు. అయితే చాలా వరకు బ్యాంకులు ఐడి ప్రూఫ్ సమర్పించిన తర్వాత మాత్రమే నోట్లను మారుస్తున్నాయి. అయితే, RBI సెప్టెంబర్ 30 తర్వాత తన కార్యాలయాల్లో రూ. 2000 నోట్లను మార్చుకోవడానికి KYCని అడిగే ఛాన్స్ ఉంది. తద్వారా వ్యక్తుల వివరాలను నమోదు చేసుకునే ఛాన్స్ ఉంది. Also Read: RTV Bramhanandam Interview: రంగమార్తాండ కోసం మూడు రోజులు ఉపవాసం.. హాస్యబ్రహ్మతో స్పెషల్ ఇంటర్వ్యూ లైవ్ Earthquake Alert Service: భూకంపం వస్తే మీ ఫోన్ ముందే చెప్పేస్తుంది.. అదెలాగంటే.. #rbi #reserve-bank-of-india #currency-change మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి