RBI: రూ.1000 నోట్లు మళ్లీ వినియోగంలోకి వస్తున్నాయా? ఈ ప్రచారంపై ఆర్బీఐ సమాధానం ఇదే..! 2000 నోటును రద్దు చేసిన ఆర్బీఐ.. ఇప్పుడు మళ్లీ రూ. 1000 నోట్లను వినియోగంలోకి తీసుకువస్తుందని ప్రచారం జరుగుతోంది. ఇదే అంశంపై ఇప్పుడు సోషల్ మీడియా లోకం కోడై కూస్తోంది. రూ. 2000 నోటు రద్దు వెనుక కారణం ఇదేనంటూ ఎవరికి తోచిన ప్రచారం వారు చేస్తున్నారు. ఆర్బీఐ కూడా ఇదే హింట్స్ ఇస్తోందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ఈ వరుస పుకార్లతో సామాన్య ప్రజలు మళ్లీ కన్‌ఫ్యూజన్‌లో పడిపోయారు. By Shiva.K 25 Oct 2023 in బిజినెస్ Latest News In Telugu New Update షేర్ చేయండి Reserve Bank of India: 8 నవంబర్, 2016.. భారతదేశ చరిత్రలో చిర స్థాయిలో నిలిచిపోయే తేదీ ఇది. దేశంలోని రెండు అత్యంత ముఖ్యమైన కరెన్సీని డీమోనిటైజ్ చేసిన రోజు ఇది. అయితే, వెయ్యి రూపాయాలను రద్దు చేసిన ఆర్బీఐ(RBI).. అంతకంటే పెద్ద నోటు రూ. 2000 లను తీసుకువచ్చింది. అయితే, అది కూడా మూన్నాళ్ల ముచ్చటే అయ్యింది. ఇటీవలే ఈ 2000 నోటుకు కూడా మంగళం పలికింది ఆర్బీఐ. ఈ నేపథ్యంలో సరికొత్త ప్రచారం తెర మీదకు వచ్చింది. 2000 నోటును రద్దు చేసిన ఆర్బీఐ.. ఇప్పుడు మళ్లీ రూ. 1000 నోట్లను వినియోగంలోకి తీసుకువస్తుందని ప్రచారం జరుగుతోంది. ఇదే అంశంపై ఇప్పుడు సోషల్ మీడియా లోకం కోడై కూస్తోంది. రూ. 2000 నోటు రద్దు వెనుక కారణం ఇదేనంటూ ఎవరికి తోచిన ప్రచారం వారు చేస్తున్నారు. ఆర్బీఐ కూడా ఇదే హింట్స్ ఇస్తోందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ఈ వరుస పుకార్లతో సామాన్య ప్రజలు మళ్లీ కన్‌ఫ్యూజన్‌లో పడిపోయారు. అసలేం జరుగుతుందో అర్థం కాక తలపట్టుకుంటున్నారు. ఆర్బీఐ నుంచి కూడా ఎలాంటి ప్రకటన రాకపోతుండటంతో.. నిజమేనేమో అని ఆలోచనలో ప్రజలు ఉన్నారు. ఎట్టకేలకు స్పందించిన ఆర్బీఐ..! రూ. 1000 నోట్లు మళ్లీ వినియోగంలోకి రానున్నాయని జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎట్టకేలకు ఆర్బీఐ స్పందించిందట. రూ. 1000 నోటును పునరుద్ధరించే ఆలోచన చేయడం లేదట. ఇదే విషయాన్ని ఉటంకిస్తూ ఏఎన్ఐ ట్వీట్ చేసింది. 'విశ్వసనీయ సమాచారం ప్రకారం రూ. 1000 నోటును తిరిగి ప్రవేశపెట్టే ఆలోచనలో ఆర్బీఐ లేదు.' అంటూ ఏఎన్ఐ ట్వీట్ చేసింది. దేశంలో రూ. 500 నోట్ల చలామణి నగదు అవసరాలకు సరిపోతుందని ఆర్బీఐ స్పష్టం చేసిందట. ఇక భాతీయులు చాలా వరకు డిజిటల్ లావాదేవీలకు అలవాటు పడ్డారు. దాంతో భౌతిక నగదుపై ఆధారపడటం కూడా తగ్గించారు. కాగా, రూ. 1000 నోట్లపై వస్తున్న పుకార్లను నమ్మవద్దని ఆర్బీఐ అధికారులు అంతర్గతంగా చెబుతున్నారు. దీనిపై ఎలాంటి అపోహలు అవసరం లేదని అధికారులు క్లారిటీ ఇచ్చారు. ఇదికూడా చదవండి: ఇలా చేస్తే చంద్రబాబుకు ఈజీగా బెయిల్ వచ్చేది.. ఉండవల్లి అరుణ్ సంచలన కామెంట్స్.. రూ. 2000 నోట్ల పరిస్థితి ఇదీ.. కాగా, రూ. 2000 నోట్లను ప్రవేశపెట్టిన ఏడేళ్ల తరువాత ఈ నోటును కూడా వెనక్కి తీసుకుంది ఆర్బీఐ. రూ. 2000 నోట్లను డిపాజిట్ చేసేందుకు 30 సెప్టెంబర్ 2023 వరకు గడువు విధిచింది. ఆ తరువాత రూ. 2000 నోట్ల డిపాజిట్ గడువు తేదీని సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 7వ తేదీ వరకు పొడిగించింది. అక్టోబర్ 8 నుంచి నిలిపివేయబడిన కరెన్సీని మార్చుకునే వెసులుబాటు ఉంది. అయితే, అన్ని బ్యాంకులలో అవకాశం ఉండదు. కేవలం ఎంపిక చేసిన ఆర్బీఐ కేంద్రాలలో మాత్రమే వీటిని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అధికారిక సమాచారం ప్రకారం.. ఈ గడువు తేదీలోగా 2000 నోట్లలో దాదాపు 87 శాతం నోట్లు బ్యాంకులో డిపాజిట్ చేసినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ.. 2000 నోట్లు విత్‌డ్రా నేపథ్యంలో మళ్లీ రూ. 1000 నోట్ల తిరిగి తీసుకువస్తారే ప్రచారాన్ని తీవ్రంగా ఖండించింది ఆర్బీఐ. RBI is not in consideration of the re-introduction of Rs 1000 note: Sources — ANI (@ANI) October 20, 2023 ఇదికూడా చదవండి: నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు.. సునీతా లక్ష్మారెడ్డికే బీఫామ్ కన్ఫామ్.. #money #rbi #reserve-bank-of-india మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి