Cyber Attacks : బ్యాంకులకు ఆర్బీఐ హెచ్చరిక.. ఎందుకంటే..

డిజిటల్ బ్యాంకింగ్ పెరిగిపోతోంది. దీంతో పాటు సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. భవిష్యత్ లో మరిన్ని సైబర్ దాడులు.. మోసాలు జరగొచ్చనీ.. వాటిని ఎదుర్కోవడానికి బ్యాంకులు సిద్ధంగా ఉండాలనీ ఆర్బీఐ బ్యాంకులకు సూచించింది. బ్యాంకులపై సైబర్ ఎటాక్స్ జరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.

RBI: ఆర్బీఐ కీలక నిర్ణయం.. ఇకపై ప్రతిదీ ట్రాక్!
New Update

Cyber Attacks : పెరుగుతున్న సైబర్ నేరాల(Cyber Crime) పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) అన్ని బ్యాంకులను అప్రమత్తం చేసింది. రానున్న కాలంలో సైబర్ దాడుల కేసులు మరింత వేగంగా పెరుగుతాయని సెంట్రల్ బ్యాంక్ పేర్కొంది. సైబర్ దొంగలు బ్యాంకులను ఎక్కువగా టార్గెట్ చేసే అవకాశం ఉందనీ.. భారతదేశంలోని కొన్ని బ్యాంకులపై సైబర్ దాడి ముప్పు ఎక్కువగా పొంచి ఉందని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. సైబర్ సెక్యూరిటీని పటిష్టం చేయాలని రిజర్వ్ బ్యాంక్ బ్యాంకులకు సూచించింది.

జాతీయ మీడియా(National Media) కథనాల ప్రకారం, రాబోయే కాలంలో కొన్ని బ్యాంకులపై సైబర్ దాడులు(Cyber Attacks) జరిగే అవకాశం ఉందని, అలాంటి బ్యాంకులు జాగ్రత్తగా ఉండాలని సెంట్రల్ బ్యాంక్ పేర్కొంది. బ్యాంకులు లేదా వారి ఖాతాదారులు ప్రభావితం కాకుండా తమ భద్రతను మెరుగుపరచుకోవాలని ఆర్బీఐ సూచించింది.  రిజర్వ్ బ్యాంక్ బ్యాంకులకు భద్రత అత్యంత ముఖ్యమైనది అని పేర్కొంది. 

 వాస్తవానికి, సైబర్ రిస్క్‌(Cyber Attacks) లను ఎదుర్కోవడానికి బ్యాంకుల సంసిద్ధతను RBI సమీక్షించింది. ఈ సమీక్షలో ఆర్‌బీఐ బ్యాంకులను హెచ్చరిస్తూ పలు సూచనలు చేసింది. సైబర్ సెక్యూరిటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరీక్షను సెంట్రల్ బ్యాంక్ నిర్వహిస్తుంది.  దీనిని CSITE అని అంటారు. CSITEలో, వివిధ బ్యాంకుల సంక్షోభ నిర్వహణ, ఇంటర్నెట్-మొబైల్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫారమ్‌ల సామర్థ్యాలు,భద్రత అదేవిధంగా బ్యాంకుల్లో జరిగే ఎలాంటి మోసాన్ని అయినా గుర్తించే పద్ధతులను సమీక్షిస్తారు. 

Also Read : గోల్డ్ లవర్స్ కి గుడ్ న్యూస్.. దిగివచ్చిన బంగారం ధరలు.. ఎంతంటే.. 

దేశంలో పెరిగిపోతున్న సైబర్ మోసాలు..

దేశంలో డిజిటల్ బ్యాంకింగ్(Digital Banking) పెరిగిపోవడంతో సైబర్ దాడుల(Cyber Attacks) ప్రమాదాలు కూడా వేగంగా పెరుగుతుండటం గమనార్హం. CSITE కింద, RBI సమీక్ష బృందం అన్ని బ్యాంకుల IT వ్యవస్థలను క్షుణ్ణంగా పరిశీలిస్తుంది.  బ్యాంకులు సురక్షితంగా ఉండేలా దాని లోపాలను కనుగొంటుంది. కమిటీ నిర్వహించిన ఈ విచారణలో, ప్రమాదాన్ని పెంచే పాయింట్లను గుర్తిస్తారు. . పెరుగుతున్న సైబర్ నేరాల దృష్ట్యా, అన్ని బ్యాంకుల సైబర్-ఐటీ విభాగాలను సమీక్షించాల్సిన అవసరం ఉందని సెంట్రల్ బ్యాంక్ భావించింది.

అప్రమత్తంగా ఆర్బీఐ

రిజర్వ్ బ్యాంక్ ఇంతకుముందు కూడా ఇలాంటి విషయాల గురించి బ్యాంకులు, ఖాతాదారులను అప్రమత్తం చేసింది. కొత్త తరహా సైబర్ బెదిరింపులకు(Cyber Attacks) బ్యాంకింగ్ రంగం సిద్ధం కావాలని సెంట్రల్ బ్యాంక్(Central Bank) డిప్యూటీ గవర్నర్ టి రవిశంకర్ ఇటీవల అన్నారు. అలాగే మీరు మీ భద్రతా వ్యవస్థను మెరుగుపరచుకోవాలని ఆయన బ్యాంకులతో పాటూ ఎకౌంట్ హోల్డర్స్ కి కూడా సూచించారు. 

#digital-banking #cyber-attacks #central-bank #rbi
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe