Gold Rates Drop : గోల్డ్ లవర్స్ కి గుడ్ న్యూస్.. దిగివచ్చిన బంగారం ధరలు.. ఎంతంటే.. 

రెండు రోజుల పాటు స్థిరంగా వున్న బంగారం ధరలు ఈరోజు భారీగా తగ్గాయి.  ఈరోజు హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.60,380ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.66,530ల వద్ద ఉన్నాయి. వెండి ధర కేజీకి  రూ.80,000 వద్ద ఉంది.

New Update
Gold Rate: తగ్గడం మూన్నాళ్ల ముచ్చటే.. మళ్ళీ పెరిగిన బంగారం ధరలు.. 

Gold Rates Dropped : గత వారంలో వరుసగా పెరుగుతూ రికార్డు స్థాయికి చేరిన బంగారం ధరలు(Gold Rates Drop) గత రెండు రోజులు స్థిరంగా ఉన్నాయి. అయితే, ఈరోజు బంగారం ధరలు భారీగా తగ్గి గోల్డ్ లవర్స్ కి ఊరటనిచ్చాయి. దీంతో బంగారం ప్రియులకు భవిష్యత్ లో మరింత తగ్గే అవకాశం ఉంటుందనే ఆశలు రేకెత్తాయి. బంగారం ధరలు ప్రతిరోజూ పైకీ.. కిందికీ కదులుతూనే ఉంటాయి. బంగారం ధరల(Gold Rates Drop) తగ్గుదల – పెరుగుదలపై చాలా అంశాలు ప్రభావం చూపిస్తాయి. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో పెరుగుదల, సెంట్రల్ బ్యాంకులు బంగారం కొనడంపై చూపించిన ఉత్సాహం, యూఎస్ ఫెడ్ రేట్లు తగ్గిస్తారనే వార్తల నేపథ్యంలో ఈ నెలలో వరుసగా  బంగారం ధరలు పైపైకి ఎగసినట్టు నిపుణులు భావిస్తున్నారు. ఇక ఈరోజు అంటే మార్చి19న అంతర్జాతీయ స్థాయిలో బంగారం ధర(Gold Rates Drop) పెరుగుదల నమోదు చేసింది.  అయితే, దేశీయంగా మాత్రం ఆ ఎఫెక్ట్ కనిపించలేదు. భారత్ లో బంగారం ధరల్లో భారీ తగ్గుదల కనిపించింది. మరోవైపు వెండి ధరలు కూడా తగ్గుదల నమోదు చేశాయి. ఈరోజు అంటే మంగళవారం (మార్చి19) మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం, వెండి ధరలు(Gold Price) దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.                            

హైదరాబాద్ లో బంగారం ధరలు..
హైదరాబాద్(Hyderabad) లో రెండు రోజులుగా నిలకడగా ఉన్న బంగారం ధరలు ఈరోజు భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(Gold Rates Drop) 210 రూపాయలు తగ్గి రూ.60,380ల వద్ద ఉంది.  24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు 230 రూపాయలు తగ్గి రూ.65,870లుగా ఉంది.  

ఢిల్లీలో బంగారం ధరలు ఇలా..
అలాగే ఢిల్లీలో కూడా బంగారం ధరలు(Gold Price) స్వల్పంగా తగ్గాయి.  ఇక్కడ  22 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు 210 రూపాయలు తగ్గింది. దీంతో (Gold Rates Drop) రూ.60,530ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఇక్కడ కూడా 230 రూపాయల తగ్గుదల నమోదు చేసి రూ.66,020లుగా ఉంది.  

Also Read :  స్థిరంగా బంగారం, వెండి ధరలు

వెండి ధరలు ఇలా..
ఇక వెండి విషయానికి వస్తే.. బంగారం ధరల(Gold Rates Drop) తగ్గుదల కనిపిస్తుంటే, వెండి కూడా తగ్గుదల బాటలోనే ఉంది. హైదరాబాద్ లో వెండి కేజీకి 300 రూపాయలు తగ్గి రూ.80,000ల వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే, ఢిల్లీ(Delhi) లోనూ కేజీ వెండి 300 రూపాయలు తగ్గింది. దీంతో  రూ. 77,000ల వద్దకు చేరుకుంది. 

అంతర్జాతీయంగా..
మరోవైపు అంతర్జాతీయంగా బంగారం ధరలు భారీ పెరుగుదల నమోదు చేశాయి.  ఈరోజు ఔన్స్ బంగారం(Gold Price) 10 డాలర్లు పెరిగింది. దీంతో  2160 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా స్పాట్ వెండి ధర స్వల్ప తగ్గుదలతో(Gold And Silver Price) ఔన్స్ 25.08 డాలర్లుగా ఉంది.  

గమనిక : బంగారం ధరలు అంతర్జాతీయ పరిస్థితులు, దేశీయంగా ఉండే డిమాండ్, స్థానికంగా ఉండే పన్నులు, సెస్సులు ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతూ వస్తాయి. ఇక్కడ ఇచ్చిన ధరలు జ్యువెలరీ అసోసియేషన్ వెబ్ సైట్ లో ఇచ్చిన ధరల ఆధారంగా.. ఈరోజు మార్కెట్ ప్రారంభసమయానికి ఉన్నవి. బంగారం, వెండి కొనుక్కోవాలి అనుకుంటే, అన్ని అంశాలను పరిశీలించి.. మార్కెట్ రేట్లను స్పష్టంగా తెలుసుకుని కొనుక్కోవడం మంచిది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు