RBI REPO Rates:వడ్డీరేట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. రేపో రేటులో ఎలాంటి మార్పులు లేవని చెప్పింది. 6.5 శాతం వద్దే రెపోరేటు యథాతథం అని తెలిపింది. ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలోనే వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది. రెపో రేటును యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించడం ఇది వరుసగా 9వ సారి.
రెపో రేటు చివరిగా ఫిబ్రవరి 2023లో ఆర్బీఐ మారుస్తూ నిర్ణయం తీసుకుంది. గత 25 ఏళ్లలో సెంట్రల్ బ్యాంక్ ఇంత కాలం రెపో రేటును యథాతథంగా ఉంచడం ఇది రెండోసారి. ఏప్రిల్, మే నెలల్లో ద్రవ్యోల్బణం 4.8 శాతం వద్ద స్థిరంగా కొనసాగిందని.. జూన్ నెలలో 5.1 శాతానికి పెరిగిందని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు.
ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ.. "2024-25లో వాస్తవ GDP వృద్ధి 7.2%గా అంచనా వేయబడింది, మొదటి క్వార్టర్‌లో 7.1%, రెండో క్వార్టర్‌లో 7.2%, మూడో క్వాటర్ లో 7.3%, నాలుగో క్వార్టర్‌లో 7.2% వద్ద జీడీపీ కొనసాగింది. కాగా 2025-26 క్యూ1లో వాస్తవ జీడీపీ వృద్ధి 7.2%గా అంచనా వేయబడింది." అని ఆయన చెప్పారు.
Also Read: బెంగళూరుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్