RBI Big Update: దేశంలో చెలామణి నుండి తీసివేసిన 2000 రూపాయల పింక్ నోట్లకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పెద్ద అప్‌డేట్ ఇచ్చింది. ఒకటిన్నర సంవత్సరాల క్రితం, RBI ఈ కరెన్సీ నోట్లను చెలామణి నుండి తీసివేసింది. ఈ నోట్లను మార్చుకోవాలని లేదా బ్యాంకులో డిపాజిట్ చేయాలని ప్రజలను కోరింది. అయితే ఏడాదిన్నర గడిచినా రూ.2000 నోట్లను తమ వద్దే ఉంచుకున్న కోట్లాది మంది ఉన్నారు. వారు వాటిని బ్యాంకులో డిపాజిట్ చేయలేదు లేదా వాటిని మార్చుకోలేదు.ఇప్పటి వరకు మార్కెట్‌లో ఉన్న 100 శాతం నోట్లు తిరిగి ఆర్బీఐ కి రాలేదు. ఇటీవల దీనికి సంబంధించిన వివరాలను పంచుకుంటూ, దేశంలో ఇప్పటికీ రూ.7261 కోట్ల కంటే ఎక్కువ విలువైన రూ.2000 నోట్లను ప్రజల వద్దే ఉండిపోయాయని ఆర్‌బీఐ తెలిపింది. ఇప్పటి వరకు 2000 రూపాయల నోట్లలో 97.96 శాతం మాత్రమే బ్యాంకులకు తిరిగి వచ్చాయి.
ఎన్ని నోట్లు తిరిగి వచ్చాయి?
RBI Big Update: 2000 విలువైన నోట్లలో 97.96 శాతం బ్యాంకులకు తిరిగి వచ్చినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) వెల్లడించింది. ప్రజల వద్ద ఇప్పటికీ రూ.7,261 కోట్ల విలువైన నోట్లు ఉన్నాయి. రూ. 2,000 విలువైన బ్యాంకు నోట్లను మే 19, 2023న విత్‌డ్రా చేయనున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఆ సమయంలో 3.56 లక్షల కోట్లు విలువైన రూ. 2,000 బ్యాంకు నోట్లు చలామణిలో ఉన్నాయని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. ఈ ఏడాది ఆగస్టు 30న వ్యాపారం ముగిసే సమయానికి ఈ సంఖ్య రూ. 7,261 కోట్లకు తగ్గిందని, మే 19, 2023 వరకు చెలామణిలో ఉన్న రూ. 2000 నోట్లలో 97.96 శాతం బ్యాంకులకు తిరిగి వచ్చినట్లు తెలిపింది. రెండువేల రూపాయల నోట్లను డిపాజిట్ చేసే లేదా మార్చుకునే సదుపాయం అక్టోబర్ 7, 2023 వరకు దేశంలోని అన్ని బ్యాంకు శాఖల్లో అందుబాటులో ఉండేది.
పోస్టాఫీసులో కూడా సౌకర్యం ఉంది
RBI Big Update: మే 19, 2023 నుండి రిజర్వ్ బ్యాంక్ 19 ఇష్యూ కార్యాలయాలలో ఈ విలువ కలిగిన బ్యాంక్ నోట్లను మార్చుకునే సదుపాయం అందుబాటులో తీసుకువచ్చింది. అక్టోబర్ 9, 2023 నుండి, ఆర్‌బిఐ ఇష్యూ కార్యాలయాలు వ్యక్తులు - సంస్థల నుండి డిపాజిట్ చేయడానికి రూ. 2000 బ్యాంకు నోట్లను కూడా అంగీకరిస్తున్నాయి. వారు తమ బ్యాంకు ఖాతాల్లో నోట్లు జమ చేసుకోవచ్చు. ప్రజలు తమ బ్యాంకు ఖాతాల్లో జమ చేయడానికి దేశంలోని ఏదైనా పోస్టాఫీసు నుండి 2000 రూపాయల నోట్లను పంపవచ్చు.
నోట్లు ఎక్కడ మార్పిడి చేస్తున్నారు
RBI Big Update: అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురంలో 19 RBI కార్యాలయాలు బ్యాంకు నోట్ల డిపాజిట్/మార్పిడిని అందిస్తున్నాయి. 2016 నవంబర్‌లో రూ.1000, రూ.500 నోట్లను చెలామణి నుంచి తొలగించిన తర్వాత రూ.2000 బ్యాంకు నోట్లను ప్రవేశపెట్టారు.
Also Read : 2 కోట్ల విరాళం ప్రకటించిన ప్రభాస్!