TDP VS Janasena : రాజోలులో రాజుకుంటున్న టికెట్‌ రగడ.. టీడీపీలో మొదలైన అసంతృప్తి!

రాజోలు నియోజక వర్గం నుంచి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ జనసేన అభ్యర్థి పోటీ చేస్తారని ప్రకటించడంతో గొల్లపల్లి అనుచరులు అంతా ఒక్కసారిగా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.దీంతో గొల్లపల్లి అనుచరులు రాజోలు నుంచి 40 కార్లలో మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయానికి వెళ్లారు.

TDP VS Janasena : రాజోలులో రాజుకుంటున్న టికెట్‌ రగడ.. టీడీపీలో మొదలైన అసంతృప్తి!
New Update

Razole : అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రాజోలు(Razole) నియోజకవర్గంలో రాజుకుంటున్న టికెట్‌ రగడ. టీడీపీ(TDP) కార్యకర్తల్లో ఇంకా వీడని గందరగోళం. నిన్న మొన్నటి వరకు అక్కడ టీడీపీ నేత గొల్లపల్లి సూర్యారావు(Gollapalli Surya Rao) పోటీ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ ఒక్కసారిగా రాజోలు నియోజక వర్గం నుంచి జనసేన(Janasena) అధినేత పవన్‌ కల్యాణ్‌ జనసేన అభ్యర్థి పోటీ చేస్తారని ప్రకటించడంతో గొల్లపల్లి అనుచరులు అంతా ఒక్కసారిగా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

దీంతో గొల్లపల్లి అనుచరులు రాజోలు నుంచి 40 కార్లలో మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయానికి వెళ్లారు. అచ్చెన్నాయుడిని కలిసిన వారంతా.. గొల్లపల్లికి రాజోలు టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. దీని గురించి మల్కిపురంలో టీడీపీ విస్తృతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గొల్లపల్లికి టికెట్‌ ఇవ్వని పక్షంలో ఆయన ఇండిపెండెంట్‌ గా పోటీ చేయడమా లేక మరో పార్టీలోకి మారడమా అనే దాని గురించి కార్యకర్తలు చర్చించినట్లు సమాచారం.

దీంతో విషయం తెలుసుకున్న రాజోలు టీడీపీ ఇంచార్జి , మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యరావు స్పందించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రెండు పార్టీలు ఏకమై ప్రజల కోసం పోరాడుతున్న, పాటు పడుతున్న నాయకులు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan). రెండు పార్టీల సిద్దాంతాలను నాయకులు, నేతలు అందరూ గౌరవించాలని ఆయన పిలుపునిచ్చారు.

టికెట్‌ కేటాయింపు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కార్యకర్తలకు హితవు పలికారు. టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు అందరూ కూడా సమన్వయంతో వ్యవహరించాలని గొల్లపల్లి కోరారు. ఈ క్రమంలో ఆర్టీవీతో ఎక్య్స్లూజివ్‌ గొల్లపల్లి మాట్లాడారు. రాజోలు టికెట్ ప్రకటన పై రకరకాల ఊహగానాలు వస్తున్నాయి.

Also Read : విశాఖపై వైసీపీ స్పెషల్ ఫోకస్..!

పొత్తులు అనేది ఇద్దరు కూర్చుని చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని గొల్లపల్లి పేర్కొన్నారు. ఎవరికి వారు ప్రకటించుకోవడం అనేది పొత్తు ధర్మం కాదని వివరించారు. పార్టీ పరంగా అనేక రిపోర్టులు ఉంటాయి. వాటన్నిటి ఆధారంగా నాయకులు విషయం ఏంటి అనేది చర్చిస్తారు. పార్టీ మారటం అనేది వాస్తవం లేదు.

మేమంతా కూడా టీడీపీ కుటుంబ సభ్యులమే. మరోసారి పరిశీలించిన తరువాత రాజోలు టికెట్‌ గురించి పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకుంటారు. నియోజకవర్గంలో వైసీపీ పార్టీ అవినీతిని ఎండగడుతూ అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మాజీ మంత్రిగా ఎన్నో ఎన్నికలు చూశాను. పొత్తులో భాగంగా సర్వేలు ఆధారంగా టికెట్‌ నాకే కేటాయిస్తారని ఆశిస్తున్నాను. అధినాయకులు ఇద్దరు మరో మారు తీసుకునే నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాను అంటూ గొల్లపల్లి వివరించారు.

Also read: ఏపీ నిరుద్యోగులకు శుభవార్త..భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్‌!

#tdp #janasena #razole #eastgodavari #gollapalli-suryarao
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe