Mr.Bachchan : రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న 'మిస్టర్ బచ్చన్'.. థియేటర్స్ లో రవితేజ సందడి ఆరోజు నుంచే?

రవితేజ లేటెస్ట్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. అంతేకాకుండా రిలీజ్ కు ఒక్కరోజు ముందు అంటే ఆగస్టు 14 న స్పెషల్ ప్రీమియర్స్ ను సైతం ప్రదర్శించనున్నట్లు తెలిపారు.

New Update
Mr.Bachchan : రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న 'మిస్టర్ బచ్చన్'.. థియేటర్స్ లో రవితేజ సందడి ఆరోజు నుంచే?

RaviTeja's Mr.Bachchan Release Date Out : టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’. పక్కా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. షాక్, మిర‌ప‌కాయ్ వంటి సూపట్ హిట్స్ తర్వాత హరీష్ శంకర్, రవితేజ కాంబోలో రాబోతున్న ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో కన్నడ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించింది. సీనియర్ నటుడు జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన టీజర్, సితార్ సాంగ్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకోగా.. తాజాగా మేకర్స్ రిలీజ్ అప్డేట్ ఇచ్చారు. ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

Also Read : ‘మురారి’ మూవీ ప్లాప్ అన్న నెటిజన్.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన కృష్ణవంశీ!

అంతేకాకుండా రిలీజ్ కు ఒక్కరోజు ముందు అంటే ఆగస్టు 14 న స్పెషల్ ప్రీమియర్స్ ను సైతం ప్రదర్శించనున్నట్లు తెలిపారు. ఈ అప్డేట్ తో మాస్ మహారాజా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. రిలీజ్ కు ముందే ప్రీమియర్స్ చూడాలని తహతహలాడుతున్నారు.


Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు