Andhra Pradesh: పేదల పాలిట సంజీవనిగా.. 'రవిప్రకాష్ సిలికాన్ ఆంధ్ర సంజీవని' ఆస్పత్రి

కృష్ణా జిల్లాలోని కూచిపూడి గ్రామంలో 'రవిప్రకాష్ సిలికన్ఆంధ్ర సంజీవని' అనే ఆసుపత్రి ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ హాస్పిటల్‌లో లభిస్తున్న ఉచిత, మెరుగైన వైద్యం కోసం వివిధ గ్రామీణ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున రోగులు ఇక్కడికి వస్తున్నారు.

Andhra Pradesh: పేదల పాలిట సంజీవనిగా.. 'రవిప్రకాష్ సిలికాన్ ఆంధ్ర సంజీవని' ఆస్పత్రి
New Update

ఈ ప్రపంచంలో ఎన్నో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు ఉన్నాయి. కానీ అందులో కొన్నింటికి మాత్రమే పాపులారిటీ దక్కుతుంది. ముఖ్యంగా కొన్ని ఆసుపత్రులు రోగులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతాయి. ఇలాంటి హాస్పిటల్స్ చాలా అరుదుగా ఉంటాయి. కృష్ణా జిల్లాలోని కూచిపూడి గ్రామంలో ఉన్న 'రవిప్రకాష్ సిలికాన్ ఆంధ్ర సంజీవని, సాయి ఆరోగ్య మల్టీస్పెషాలిటీ' అనే ఆసుపత్రి కూడా ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ హాస్పిటల్‌లో లభిస్తున్న ఉచిత, మెరుగైన వైద్య సేవల కోసం వివిధ గ్రామీణ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున రోగులు ఇక్కడికి వస్తున్నారు.

Also Read: పిఠాపురంలో హై అలర్ట్.. వారికి ఐజీ సీరియస్ వార్నింగ్!

మే నెలలో వైద్యం కోసం ఎక్కువ సంఖ్యలో రోగులు రావడంతో ఈ సంజీవని ఆసుపత్రి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఈ నెలలో ఏకంగా 7043 మంది ఔట్‌ పేషెంట్స్‌, 606 మంది ఇన్‌పేషెంట్స్‌ వచ్చారు. అలాగే 69 సర్జరీలు జరిగాయి. ఏప్రిల్ నెలలో 5946 మంది ఔట్‌ పేషెంట్స్‌, 385 మంది ఇన్‌పేషెంట్స్‌ వచ్చారు. 26 సర్జరీలు జరిగాయి. మార్చిలో 5612 మంది ఔట్‌ పేషెంట్స్ , 51 మంది ఇన్‌పేషెంట్స్‌ రాగా.. 16 సర్జరీలు జరిగాయి.

అలాగే ఫిబ్రవరి నెలలో 1326 మంది ఔట్‌ పేషెంట్స్‌, 33 మంది ఇన్‌పేషెంట్స్ రాగా.. వైద్యులు 5 సర్జరీలు చేశారు. జనవరి నెలలో 1196 మంది ఔట్‌పేషెంట్స్, 24 మంది ఇన్‌పేషెంట్స్‌ ఈ ఆసుపత్రిలో వైద్య సేవల్ని వినియోగించుకోగా.. 6 సర్జరీలు జరిగాయి. గత కొన్ని నెలల నుంచి రోజురోజుకు ఈ సంజీవని ఆసుపత్రిలో వైద్య చికిత్స చేయించుకుంటున్న రోగుల సంఖ్య పెరగడం విశేషం.

publive-image

Also Read:  విజయోత్సవ ర్యాలీలకి అనుమతి లేదు.. పెనమలూరు పోలీస్ స్టేషన్లను సందర్శించిన జిల్లా ఎస్పీ

#andhra-pradesh #ravi-prakash #ravi-prakash-siliconandhra-sanjivani #free-hospital #sanjivani-hospital
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe