/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-2023-12-28T195322.112-jpg.webp)
Also Read: Ravi Teja : మాస్ రీయునియన్.. మరో సారి రిపీట్ కానున్న క్రేజీ కాంబో..!
హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం మిస్టర్ బచ్చన్ (Mr Bachchan). ఇటీవలే ఈ చిత్రం పూజ కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. తాజాగా సినిమా షూటింగ్ మొదలైనట్లు చిత్రం బృదం ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, T సిరీస్ మరియు పనోరమా స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే రవితేజ సరసన కథానాయికగా కనిపించనుంది. మిక్కీ జె మేయర్ (Mickey J Meyer) సినిమాకు సంగీతం అందిస్తున్నారు. పీరియాడికల్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. రవితేజ, హరీష్ శంకర్ కాంబో కావడంతో ప్రేక్షకుల మరింత ఆసక్తిగా ఉన్నారు.
రీసెంట్ గా రవితేజ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. తనకు ఎంతో ఇష్టమైన బచ్చన్ పేరున్న పాత్రను పోషించడం చాలా గౌరవంగా ఉందని తెలిపారు రవితేజ. మరో వైపు రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో రాబోతున్న ఈగల్ సినిమా (Eagle Movie) ప్రమోషన్స్ కూడా బిజీగా సాగుతున్నాయి. ఈ సినిమా జనవరి 13 న థియేటర్స్ లో రిలీజ్ కానుంది.
#MrBachchan Naam tho suna hoga 😉
Honoured to play the character with the name of my favourite @SrBachchan saab 🤗🙏@harish2you @peoplemediafcy @TSeries pic.twitter.com/CHMOvgh3bo
— Ravi Teja (@RaviTeja_offl) December 17, 2023
Also Read: Big 4: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ఒకే వేదికపై చిరు, బాలయ్య, వెంకీ, నాగ్.. ఎందుకంటే?