/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-07T193243.181-jpg.webp)
Eagle Trailer Released: డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ఈగల్. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవలే ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఫిబ్రవరి 9న థియేటర్స్ లో విడుదల కానున్నట్లు ప్రకటించారు. ఇక మూవీ రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో.. ప్రమోషన్స్ కూడా వేగవంతం చేశారు. ఈ సందర్భంగా తాజాగా ఈగల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈగల్.. పద్ధతైన దాడి అంటూ విడుదలైన ఈ ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది.
Also Read: Buchi Babu: రామ్ చరణ్ ‘RC16’ లో నటించే అవకాశం.. డైరెక్టర్ బుచ్చిబాబు ఇంట్రెస్టింగ్ వీడియో
ఈగల్ ట్రైలర్
"మ్యాప్స్ , రీసెర్చ్ కు కూడా అందని విషయం ఒకటున్నది సార్.. అక్కడ ఒకడుంటాడు.." అంటూ యాక్టర్ శ్రీనివాస్ రెడ్డి చెప్పే డైలాగ్స్ ట్రైలర్ మొదలవుతుంది. ఆ తర్వాత ఫుల్ యాక్షన్ సీన్స్ తో రవితేజ క్యారెక్టర్ ను పవర్ ఫుల్ గా చూపించారు. "అక్కడ పదేళ్లుగా గాడ్జిల్లా ఉంటోంది.. ఆ రోజు మృగాలను మింగే మహాకాళుడు నిద్ర లేచాడు" అనే డైలాగ్స్ రవితేజ పాత్రను ఎలివేట్ చేసేలా ఉన్నాయి. "దళం, సైన్యం కాదు.. దేశము వచ్చిన ఆపుతాను" అంటూ రవితేజ చెప్పిన మాస్ డైలాగ్స్ హైలెట్ గా నిలిచాయి. ట్రైలర్ చివరిలో.. "మీలాంటి వాళ్ళను చాలా మందిని చూశాము" అనే డైలాగ్ కు.. "ఆ చాలా మంది చివరిగా చూసింది ఆయన్నే" అంటూ నవదీప్ చెప్పిన మాటలు హీరో పాత్రకు మరింత హైప్ క్రియేట్ చేశాయి. పవర్ ఫుల్ డైలాగ్స్, యాక్షన్ సీన్స్ ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, టీజర్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవితేజ సరసన కథానాయికలుగా కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ నటించారు. వినయ్ రాయ్, మధు, శ్రీనివాస్, అవసరాల అజయ్ ఘోష్, నితిన్ మెహతా, శ్రీనివాస్ రెడ్డి, నవదీప్ కీలక పాత్రలు పోషించారు.
Also Read: Kerela Stories: ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘ది కేరళ స్టోరీ’.. స్ట్రీమింగ్ డేట్ ఇదే