Telangana: రేషన్‌ కార్డు లేనివారికి గుడ్‌న్యూస్‌..

తెలంగాణలో త్వరలోనే అర్హులకు రేషన్‌ కార్డులు జారీ చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వెల్లడించారు. రేషన్ కార్డులు, హెల్త్‌ కార్డులు వేరువేరుగా ఇస్తామన్నారు. రాష్ట్రంలో దాదాపు 10 లక్షల మందికి పైగా రేషన్ కార్టుల కోసం ఎదురుచూస్తున్నారు.

New Update
Telangana: రేషన్‌ కార్డు లేనివారికి గుడ్‌న్యూస్‌..

కాంగ్రెస్ ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ తెలిపింది. త్వరలోనే అర్హులకు రేషన్‌ కార్డులు జారీ చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వెల్లడించారు. రేషన్ కార్డులు, హెల్త్‌ కార్డులు వేరువేరుగా ఇస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులకు రేషన్ కార్డులు జారీ చేస్తామని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో దాదాపు 10 లక్షల మందికి పైగా రేషన్ కార్టుల కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవలే రేవంత్ సర్కార్ రైతు రుణమాఫీ కూడా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.

Also Read: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. ఆ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్!

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు ప్రజా పాలన దరఖాస్తులు స్వీకరించిన సంగతి తెలిసిందే. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత.. ఇలా అయిదు పథకాలు అర్హులకు అందించేందుకు కొన్ని నెలల క్రితం దరఖాస్తులు స్వీకరణ ప్రారంభించింది. అయితే పలు పథకాలకు రేషన్‌ కార్డును లింక్ చేయడం.. అది లేనివారు నష్టపోతున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే అర్హులకు త్వరలోనే రేషన్‌ కార్డులు జారీ చేసేందుకు కాంగ్రెస్‌ సర్కార్ కసరత్తులు చేస్తోంది.

Also read: హైదరాబాదాద్ వాసులకు రేవంత్ శుభవార్త.. మూసీ అభివృద్ధికి ఎన్ని వేల కోట్లంటే?

Advertisment
తాజా కథనాలు