BREAKING: రుణమాఫీకి రేషన్ కార్డు నిబంధన.. క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్!

TG: రైతు రుణమాఫీకి రేషన్ కార్డు నిబంధనలపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. భూమి పాస్ బుక్ ఆధారంగానే కుటుంబానికి రూ.2లక్షల పంట రుణమాఫీ చేస్తామని చెప్పారు. కేవలం కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే రేషన్ కార్డు నిబంధన తీసుకొచ్చామని స్పష్టం చేశారు.

New Update
BREAKING: రుణమాఫీకి రేషన్ కార్డు నిబంధన.. క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్!

Telangana: తెలంగాణ రైతు రుణమాఫీకి రేషన్ కార్డు నిబంధనలపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. భూమి పాస్ బుక్ ఆధారంగానే కుటుంబానికి రూ.2లక్షల పంట రుణమాఫీ చేస్తామని చెప్పారు. కేవలం కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే రేషన్ కార్డు నిబంధన తీసుకొచ్చామని మంగళవారం కలెక్టర్ల సదస్సులో స్పష్టం చేశారు.

తప్పనిసరి నిబంధనపై రైతులు ఆందోళన..
ఈ మేరకు సోమవారం పంటల రుణమాఫీకి తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా కుటుంబానికి రూ.2లక్షల వరకు రుణమాఫీ వర్తిస్తుందని వ్యవసాయశాఖ స్పష్టం చేసింది. 2018 డిసెంబర్‌ 12 నుంచి 2023 డిసెంబర్‌ 13 వరకు తీసుకున్న పంట రుణాల బకాయిలకు మాత్రమే ఈ రుణమాఫీ వర్తిస్తుందని, రైతు కుటుంబం గుర్తింపునకు రేషన్‌కార్డు ప్రామాణికమని తెలిపింది. అయితే రేషన్ కార్డు తప్పనిసరి నిబంధనపై పలువురు రైతులు ఆందోళనకు గురయ్యారు. కొంతమందికి రేషన్ కార్డులు లేకపోగా.. కొత్తగా ఏర్పడిన మరికొన్ని కుటుంబాలకు ఇంకా రేషన్ కార్డులు ఇవ్వలేదు ప్రభుత్వం. ఈ నేఫథ్యంలో ఇందుకు సంబంధించి రైతుల ఆందోళనలు సీఎం దృష్టికి వెళ్లడంతో క్లారిటీ ఇచ్చారు. ఇక పంట రుణమాఫీ కోసం ప్రత్యేక వెబ్‌ పోర్టల్‌ ఏర్పాటు చేయనున్నారు. రుణమాఫీ నగదు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే జమకానుంది.

హరీశ్‌రావు డిమాండ్‌..
ఇదిలా ఉంటే.. ఎలాంటి షరతులూ లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కొత్త రేషన్‌ కార్డులు జారీ చేయకుండా ప్రభుత్వం జాప్యం చేయడంతో చాలా మంది రైతులు రుణమాఫీకి అర్హత కోల్పోతున్నారని అన్నారు. రుణమాఫీకి పాస్‌బుక్‌ మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని సూచించారు.

Advertisment
తాజా కథనాలు