/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-8-2.jpg)
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు సరదాగా బ్యాడ్మింటన్ ఆడారు. బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్‌తో కలిసి కాసేపు కోర్టులో షటిల్ ఆడారు. రేపు రాష్ట్రపతి భవన్‌లో మహిళా పద్మశ్రీ, పద్మభూషణ్‌లో కలిసి ద్రౌపది ముర్ము ముఖాముఖి కానున్నారు. ఈ కార్యక్రమంలో సైనా నెహ్వాల్ ప్రత్యేక అతిధిగా పాల్గొనడమే కాకుండా అందులో ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా సైనా ఒకరోజు ముందే ఢిల్లీకి చేరుకున్నారు. మరోవైపు రాష్ట్రపతికి కూడా కాస్తంత సమయం దొరకడంతో సైనాతో కలిసి బ్యాడ్మింటన్ ఆడారు. వీరి ఆటకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియోను సైనానే స్వయంగా ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.
What a memorable day of my life 😍🙏..Thank you so much President Mam for playing badminton with me 🙏 #presidentofindia @rashtrapatibhvn pic.twitter.com/jt9ucXuZrx
— Saina Nehwal (@NSaina) July 10, 2024
#WATCH | President Droupadi Murmu played badminton with ace shuttler Saina Nehwal at the Badminton Court in Rashtrapati Bhavan, Delhi today.
(Video: Rashtrapati Bhavan) pic.twitter.com/sLmFqQSMtk
— ANI (@ANI) July 10, 2024